ఫైనల్లీ ట్విట్టర్ లోకి ఎంట్రీ ఇచ్చిన స్టార్ హీరోయిన్.. ఎవరంటే..!

ఒకప్పుడు సినీనటులు, రాజకీయ నాయకులు, ప్రముఖ క్రీడాకారులు తమకు సంబంధించిన విషయాలను వెల్లడించడానికి పత్రికలు, టీవీ ఛానళ్లను ఆశ్రయించేవారు. అయితే ట్విట్టర్ వంటి సామాజిక వేదికలు అందుబాటులోకి వచ్చిన తర్వాత తమకు సంబంధించిన విషయాలు ఇతరులకు వెల్లడించడానికి వారికి చక్కటి అవకాశం లభించింది. ముఖ్యంగా సినీ నటులు తమ రోజువారి కార్యకలాపాలు,అప్డేట్లు ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు. తమ సినిమాలకు సంబంధించిన విషయాలే కాకుండా వ్యక్తిగత విషయాలను ట్విట్టర్ ద్వారా వెల్లడిస్తున్నారు.

సినీ నటులు చాలా మంది ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ వంటి సామాజిక వేదికలను వినియోగిస్తుండగా.. కొందరు మాత్రం సోషల్ మీడియాకు దూరంగా ఉండిపోయారు. ఏళ్ల తరబడి ఇది ఇలాగే కొనసాగింది. అయితే తమ సినిమాల ప్రమోషన్ లకు ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ లు ఎంతో ఉపయోగపడుతుండటంతో మెల్లమెల్లగా వారుకూడా సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇవ్వడం ప్రారంభించారు. సోషల్ మీడియా కి ఎంత దూరంగా ఉండే తెలుగు హీరో శర్వానంద్ కొంతకాలం కిందటి వరకూ బటన్ ఫోన్ నే వినియోగించారు. ఆ తర్వాత టచ్ సెల్ లోకి మారి ట్విట్టర్ లోకి ప్రవేశించారు.

కొద్దిరోజుల కిందట తమిళ అగ్ర హీరో విక్రమ్ కూడా ట్విట్టర్ లోకి ఎంట్రీ ఇచ్చినట్లు ప్రకటించాడు. తాజాగా ప్రముఖ హీరోయిన్ నిత్యా మేనన్ ట్విట్టర్ లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నిత్యా మేనన్ గత ఏడాది వరకు ట్విట్టర్ లో ఉన్నారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి ట్విట్టర్ కి దూరంగా ఉంటూ వచ్చారు. తాజాగా ట్విట్టర్ లోకి మరో అకౌంట్ తో ఎంట్రీ ఇచ్చి తన తొలి ట్వీట్ చేశారు. తమ అభిమాన తార ట్విట్టర్లోకి రీ ఎంట్రీ ఇవ్వగానే ఆమె అభిమానులు వెల్ కమ్ చెబుతూ ట్వీట్లు చేస్తున్నారు.

Tags: nitya menon, Nitya Menon Updates, tollywood actors, tollywood heroiens