ఆమె కోస‌మే భార్య‌కు విడాకులు ఇచ్చాను… సంప‌త్‌రాజ్ బ‌య‌ట పెట్టిన టాప్ సీక్రెట్‌…!

టాలీవుడ్ లో స్టార్ విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్న సంపత్ రాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కామెడీ చేసి నవ్వించిన ఈయన చాలా సినిమాల్లో విలన్ గా కూడా నటించారు. మిర్చి సినిమాలో విలన్ గా నటించిన పాత్రకు బాగా గుర్తింపు వచ్చింది. ఈ సినిమా తర్వాత ఎన్ని సినిమాల్లో విలన్ గా నటించినప్పటికీ ఆయనకు మిర్చి సినిమా ద్వారా వచ్చినంత గుర్తింపు రాలేదు.

The Gambinos - Malayalam Movie - Any Sampath Raj fans, here? #TheGambinos  #malayalammovie #thegambinosmalayalammovie #malayalammovies2018 #sampathraj  #sampathraj #gambinosmovie | Facebook

చాలా సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న సంపత్ రాజ్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం గురించి కొన్ని విషయాలను పంచుకున్నారు. సంపత్ సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చిన విధానం చాలా గొప్పగా ఉంటుంది. చిన్నప్పుడు ఇంటి నుంచి పారిపోయి ఇండస్ట్రీలోకి వచ్చాడట సంపత్ రాజ్. సంపత్ అమ్మకు అతను ఇండస్ట్రీలోకి రావడం ఇష్టం లేకపోవడంతో నాన్న సహాయం ద్వారా ఇంట్లోంచి పారిపోయి.. ఇండస్ట్రీలో అవకాశాల కోసం చాలా కష్టపడిన తర్వాత ఆయన ఛాన్సులు సంపాదించుకొని వాటి ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

ఇండస్ట్రీలో స్టార్‌డం వచ్చిన తర్వాత సంపత్ తల్లి చాలా సంతోషించారట. కాకపోతే ఆ విజయాన్ని చూడడానికి వాళ్ళ నాన్న అప్పటికే చనిపోయారు అంటూ బాధపడ్డారు సంపత్ రాజ్. సంప‌త్ తన చిన్న వయసులోనే పెళ్లి చేసుకుని ఒక పాప పుట్టిన తర్వాత విడాకులు ఇచ్చేసి ప్రస్తుతం ఒంటరిగానే ఉంటున్నారు. సంపత్ తన కూతురికి నాలుగు సంవత్సరాల వయసులోనే భార్యకు విడాకులు ఇచ్చాన‌ని వారిద్దరు కూర్చుని మాట్లాడుకున్న తర్వాత అటువంటి నిర్ణయం తీసుకున్నార‌ట‌.

Actor Sampath Raj About His Divorce

ఇంత‌కు సంప‌త్‌రాజ్ భార్య ఎవ‌రో కాదు సీనియ‌ర్ న‌టీమ‌ణి శ‌ర‌ణ్య ( కొమ‌రంపులిలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌ల్లి పాత్ర‌) ఇప్పటికి తన కూతురు ఆమెను కలుస్తూ ఉంటుంద‌ని.. నేను కూడా ఆమెతో మాట్లాడుతూనే ఉంటానని చెప్పారు. అయితే 23 ఏళ్లకే వారిద్దరికీ వివాహం కావడంతో ఇద్దరి మధ్య అండర్ స్టాండింగ్ సరిగా లేకపోవడంతోనే తాము విడాకులు తీసుకోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు సంపత్. కాగా సంపత్ మాజీ భార్య ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేస్తుందట‌.