విజయ్ దేవరకొండ‌ను ఎవ‌రైనా భ‌య‌పెట్టాలంటే ఆ ప‌ని చేస్తే చాలా…!

టాలీవుడ్ లో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకపోయినా సినిమాల్లోకి వచ్చి చాలా తక్కువ సమయంలోనే స్టార్డం సొంతం చేసుకున్నాడు విజయ్ దేవరకొండ. కెరియర్ స్టార్టింగ్ లో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, నువ్విలా, ఎవడే సుబ్రహ్మణ్యం వంటి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన విజయ్ దేవరకొండ.. పెళ్లి చూపులు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి సూపర్ హిట్ సాధించాడు. ఈ సినిమా వల్ల విజయ్ దేవరకొండకు నేషనల్ అవార్డు కూడా దక్కింది. ఆ తర్వాత వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ దేవరకొండ ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు.

Pelli Choopulu' Review: This Romantic Comedy Is Very Addictive

అర్జున్ రెడ్డి సినిమా తర్వాత వచ్చిన సినిమా లేవి అంతగా సక్సెస్ కాకపోయినా తిరుగులేని క్రేజ్‌తో కొనసాగుతున్నాడు విజయ్. విజయ్ దేవరకొండ చివరిగా నటించిన లైగర్ డిజాస్టర్ గా నిలిచింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఖుషి సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. దీని తరువాత శ్రీ లీల హీరోయిన్ గా మరో సినిమాలో నటించబోతున్నాడు విజయ్.

Arjun Reddy Review, Vijay Devarakonda Arjun Reddy Movie Review

గ‌తంలో విజ‌య్ ఓ ఇంట‌ర్వ్యూ రాఫిడ్ ఫైర్ ప్ర‌శ్న‌లో ఇచ్చిన ఆన్స‌ర్ ఇప్పుడు వైర‌ల్ అవుతోంది. యాంకర్ మీరు పెద్దయ్యాక ఏమవుదాం అనుకున్నారు..? అని అడిగిన ప్రశ్నకు విజయ్ దేవరకొండ నేను కండక్టర్ కావాలి అనుకున్నాను.. కానీ హీరో అయ్యాను అని సమాధానం చెప్పాడు. దాంతో పాటే విజయ్ దేవరకొండ మాట్లాడుతూ నాకు చిన్నప్పటి నుంచి పాములు అంటే భయమని వాటిని చూస్తే వణికిపోయే వాడినని చెప్పుకొచ్చారు.

rspnetwork.in: Taxiwala Movie Hero Vijay Devarakonda Interview Stills

విజయ్ దేవరకొండ ఆ ప్రోగ్రాంలో మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అంటే విజ‌య్‌ను ఎవ‌రైనా భ‌య‌పెట్టాల‌నుకుంటే పాములు చూపిస్తే చాల‌న్న‌మాట‌. అయితే లైగర్ ప్లాప్ అయినా విజయ్ ప్రస్తుతం నటిస్తున్న ఖుషి సినిమా పైన ఆశ‌లు పెట్టుకున్నాడు. ఇటివ‌ల ఈ సినిమా నుంచి ఒక సాంగ్ రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ సంపాదించింది.