సమంత చాలా మంచిది.. విడాకుల‌పై చైతు హార్ట్ టచ్చింగ్ కామెంట్..!

నాగచైతన్య హీరోగా నటించిన ఏ మాయ చేసావే సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టింది సమంత. అయితే ఆ సినిమా షూటింగ్ టైంలో వీరిద్దరి మధ్య స్నేహం చిగురించింది. అది కాస్త కొంతకాలానికి ప్రేమగా మారడంతో ఏడు సంవత్సరాల ప్రేమాయణం తర్వాత వీరు 2017లో వివాహం చేసుకున్నారు. కాని పెళ్లి తర్వాత ఎక్కువ కాలం వీరు కలిసి జీవించలేకపోయారు. నాలుగు సంవత్సరాలు కూడా కలిసి సంసారం చేయకుండానే వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. విడాకులు తీసుకున్న తర్వాత వీరిద్దరూ ఎవరు కెరియర్ ను వారు చూసుకుంటూ బిజీ గా ఎంటున్నారు.

I remember crumbling, being sad,' says Samantha Ruth Prabhu on separating  from husband Naga Chaitanya

సమంత ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఖుషి సినిమా హీరోయిన్ గా షూటింగ్లో బిజీ షెడ్యూల్ ను గడుపుతుంది. అలాగే నాగచైతన్య.. కృతి శెట్టి హీరోయిన్ గా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కనున్న కస్టడీ సినిమాలో హీరోగా నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన చాలా ఇంటర్వ్యూలో నాగచైతన్య పాల్గొంటున్నాడు.

ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న చైతుకు సమంతతో మీరు విడిపోవడానికి కారణం ఏంటి అనే ప్రశ్న ఎదురైంది. దానిపై చైతు స్పందిస్తు సమంత చాలా మంచిదని.. సోషల్ మీడియాలో వచ్చిన ఊహగానాల వల్లే మేము విడాకులు తీసుకున్నామని క్లారిటీ ఇచ్చాడు. నా పర్సనల్ లైఫ్ లో జరిగిందంతా నా బ్యాడ్ లక్ అంటూ చెప్పిన చైతు.. తన సినిమాల గురించి ఎవరెలా మాట్లాడుకున్నా అంతగా పట్టించుకోనని చెప్పుకొచ్చాడు.

Samantha & Naga Chaitanya Sangeet – Boutiquesarees.com

మీకు ఏ హీరోయిన్ కు సంబంధించి ఏ విషయం ఇష్టం అని అడగగా పూజ హెగ్డే లో తన స్టైల్ అంటే ఇష్టమని.. కృతి శెట్టిలో అమాయ‌క‌త్వం ఇష్టమని చెప్పిన చైతు.. సమంత గురించి మాట్లాడుతూ ఆమె హార్డ్ వర్క్ అంటే నాకు ఇష్టమని. ఆమె సినిమాలపై ఎంతో నిబద్ధతతో ఉంటుందని చెప్పుకొచ్చారు. విడాకుల త‌ర్వాత కూడా సమంత గురించి అంత పాజిటివ్‌గా చైతు స్పందించడం ఇప్పుడు చైతు ప‌ట్ల గౌర‌వాన్ని మ‌రింత పెంచేలా చేసింది.