ఇకపై సమంతని గెలికితే.. కోర్టు మెట్లు ఎక్కడం ఖాయం..!

అగ్ర సినీ తార సమంత నాగచైతన్య నుంచి విడాకులు తీసుకున్న తర్వాత ప్రజలు ఆమెపై చాలా ట్రోల్స్, మీమ్స్, బ్యాడ్ కామెంట్స్ చేశారు. అయితే సోషల్ మీడియాలో తనపై అసభ్యకరంగా కామెంట్స్ చేయడం, తప్పుడు వార్తలు ప్రచురించడాన్ని ఆమె చాలా తీవ్రంగా పరిగణించింది. అంతేకాదు, వాటన్నిటికీ తనదైన స్టైల్‌లో ఘాటుగా సమాధానాలు చెప్పింది. అలాంటిది ఇప్పుడు మాత్రం న్యాయపరమైన యాక్షన్ తీసుకుంటుంది.

గత ఏడాది నాగచైతన్య, సమంత డివోర్స్ ప్రకటించి షాకిచ్చారు. విడాకుల తర్వాత అక్కినేని అభిమానులు సమంతను విమర్శించడం మొదలుపెట్టారు. దాంతో ఆ విమర్శలను ఎదుర్కోలేని సమంత తనపై నెగిటివ్ కామెంట్స్ చేసి ట్రోల్స్ చేసె వారిపై తన లాయర్ చేత కోర్ట్‌లో కేస్ వేయించింది. ఇక రెండు రోజుల క్రితం ఒక వెబ్‌సైట్‌.. “సమంతకి స్కిన్ డిసీజ్ వచ్చింది. అందుకే ఆమె ఎవరినీ కలవడం లేదు. అసలు బయటికి రావడం లేదు, షూటింగ్స్‌కి సైతం దూరంగా ఉంటుంది. ప్రస్తుతం ఆమె స్కిన్ అలర్జీ ట్రీట్మెంట్ తీసుకుంటుంది” అని రాసింది.

ఆ వార్త చదివిన సమంత మేనేజర్ ఆ విషయం గురించి స్పందించాడు. “సమంతకి ఏ స్కిన్ ప్రాబ్లమ్స్ లేవు. ఆమె చాలా ఆరోగ్యంగా ఉన్నారు. ఈ నెలలో సమంత సైన్ చేసిన సినిమా షూటింగ్స్ కి కూడా వెళ్తుంది. సమంత గురించి ఎవరైనా ఇలాంటి నెగిటివ్ న్యూస్ స్ప్రెడ్ చేస్తే వారిపై లీగల్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇకపై సమంత గురించి ఏమైనా న్యూస్ రాయాలంటే పూర్తిగా తెలుసుకొని రాయండి” అని సమంత మేనేజర్ ఫైర్ అయ్యాడు. ఇది చూసిన వారందరూ సమంతపై న్యూస్ రాయాలంటే కోర్టు మెట్లు ఎక్కడానికి రెడీగా ఉండాలని కామెంట్ చేస్తున్నారు.

Tags: actress samantha, Court, entertainment News, Fake News, Rumors, Samantha Ruth Prabhu, Tollywood