విజయ్ దేవరకొండ, అనన్యా పాండే జంటగా పూరీ జగన్నాథ్ (Puri Jagannath) డైరక్షన్ లో వచ్చిన సినిమా లైగర్. ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో గ్రాండ్ గా రిలీజ్ చేశారు. అయితే సినిమా అనుకున్న స్థాయిలో లేకపోవడంతో ఫ్లాప్ గా మిగిలింది. సినిమా మీద రిలీజ్ ముందు భారీ అంచనాలు ఉండటం వల్ల 90 కోట్ల దాకా బిజినెస్ జరిగింది. రిలీజ్ తర్వాత భారీ లాసులు రావడంతో ఇప్పుడు నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్స్ కి రిటర్న్ డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది.
ఈ క్రమంలో విజయ్ దేవరకొండ కూడా తన రెమ్యునరేషన్ తిగిరి ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇక ఈ లాసులను భరించేందుకు పూరీ జగన్నాథ్ తన ఆస్తులను అమ్మేస్తున్నాడని టాక్. పూరీ జగన్నాథ్, (Puri Jagannath) రామ్ కలిసి చేసిన ఇస్మార్ట్ శంకర్ హిట్ తో కొన్న ఆస్తులను లైగర్ లాసులని భరించడానికి అమ్మేస్తున్నాడట. సినిమా భాధ్యత మొత్తం తన మీద వేసుకున్న పూరీ ఈ లాసులని భరించాల్సిన అవసరం కూడా తన మీద ఉందని భావిస్తున్నాడు.
అందుకే తన ఆస్తులను అమ్మేస్తున్నాడని టాక్. లైగర్ తర్వాత స్టార్ హీరోలు ఎవరు తనకు ఛాన్స్ ఇస్తారన్న నమ్మకం లేదు అందుకే పూరీ తనయుడు ఆకాష్ తోనే సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడట. ఓ కొరియన్ మూవీని రీమేక్ చేస్తాడని ఫిల్మ్ నగర్ టాక్.