మెగా పవర్ స్టార్ రాం చరణ్ (Ram Charan) ఏంటి బట్టల షాప్ ముందు రండమ్మా రండి అంటూ బట్టలని బేరం చేయడం ఎప్పుడైనా చూశామా.. సినిమాలో పాత్ర కోసం కూడా చరణ్ అలా చేయలేదే అనుకోవచ్చు. సినిమాలో పాత్ర కోసం కాదు ఓ యాడ్ కోసం చరణ్ సేల్స్ మెన్ గా మారాడు. మీ షో ఆన్ లైన్ షాపింగ్ యాప్ కోసం రాం చరణ్ సేల్స్ మెన్ గా మారాడు. సెప్టెంబర్ చివరి వారంలో భారీ డిస్కౌంట్స్ తో మీ షో మెగా బ్లాక్ బస్టర్ సేల్ ఏర్పాటు చేస్తున్నారు.
దీని కోసం తెలుగులో చరణ్, రష్మిక మందన్న ప్రమోట్ చేస్తున్నారు. మీ షో మెగా బ్లాక్ బస్టర్ యాడ్ లో చరణ్ సేల్స్ మెన్ గా అదరగొట్టాడని చెప్పొచ్చు. చరణ్, రష్మిక తెలుగు యాడ్ చేయగా తమిళంలో కార్తీ, త్రిషలు చేశారు. ఈ యాడ్ కోసం క్రికెటర్స్ రోహిత్ శర్మ, వెటెరన్ క్రికెటర్ మాజీ ఇండియన్ టీం కెప్టెన్ సౌరవ్ గంగూలి కూడా యాడ్ లో నటించారు.
మీ షో యాడ్ లో Ram Charan నటించడం ఫ్యాన్స్ ని అలరిస్తుంది. ఆర్.ఆర్.ఆర్ తో సూపర్ హిట్ అందుకున్న చరణ్ తన నెక్స్ట్ సినిమా శంకర్ డైరక్షన్ లో చేస్తున్నారు. ఈ సినిమాలో చరణ్ సరసన కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాని పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.