సమంత షాకింగ్ డెసిషన్ .. కంగారు పడుతున్న ఫ్యాన్స్?

ప్రస్తుతం దేశంలో నెంబర్ వన్ హీరోయిన్ ఎవరైనా అడిగితే టక్కున గుర్తుకు వచ్చే పేరు సమంత. ఇటీవల పలు సర్వేల్లో దేశంలోనే నెంబర్ వన్ హీరోయిన్ గా సమంత నిలిచింది. మొన్నటి వరకు సౌత్ లోనే ఎక్కువగా సినిమాల్లో నటించిన సమంత ప్రస్తుతం హిందీ సినిమాల్లో కూడా నటిస్తోంది.

కాగా దేశవ్యాప్తంగా ఎంతో పాపులారిటీ తెచ్చుకున్న సమంత సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటుంది. ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ లలో తన తాజా సినిమాలకు సంబంధించిన కబుర్లు చెప్పడం తో పాటు తన రోజువారి అప్డేట్ లు కూడా తెలియజేస్తూ ఉంటుంది. అలాగే గ్లామరస్ ఫోటోలను కూడా అప్లోడ్ చేస్తూ ఉంటుంది.

అయితే ఏం జరిగిందో తెలియదు కానీ కొద్ది రోజులుగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటోంది సమంత. ఆమె ఖాతా నుంచి ఒక్క అప్డేట్ గాని ఫోటో గాని పోస్ట్ కాలేదు. నాగచైతన్య నుంచి విడిపోయినప్పటి నుంచి సమంతపై ట్రోల్స్ పెరిగాయి. ఇటీవల కాఫీ విత్ కరణ్ షోలో సమంత వ్యాఖ్యలపై, అలాగే ప్రధాని మోదీకి మద్దతు తెలపడం పై సోషల్ మీడియా వేదికగా సమంతపై విపరీతంగా ట్రోలింగ్ జరుగుతోంది.

దీంతో సమంత షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆమె కొంతకాలం సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పుష్ప సినిమాలో ఐటం సాంగ్ చేసిన తర్వాత సమంతపై ఒక వర్గం తీవ్రంగా ట్రోల్స్ చేసింది. అందువల్ల ఇకపై గ్లామరస్ గా నటించకూడదని సమంత నిర్ణయం తీసుకుందట. పొట్టి పొట్టి దుస్తుల్లో కనిపించడం ఆపివేయాలని, అలాగే రొమాంటిక్ సీన్లలో నటించకూడదని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా నిత్యం సోషల్ మీడియాలో అభిమానులతో టచ్ లో ఉండే సమంత ప్రస్తుతం సైలెన్స్ పాటిస్తుండటం ఆమె అభిమానులకు నచ్చడం లేదు.

Tags: actress samantha, samatha, tollywood gossips, tollywood news