మరో భారీ తప్పు చేస్తున్న పవన్ కళ్యాణ్.. మూల్యం చెల్లించుకోవాల్సిందేనా?

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోలీవుడ్‌లో విజయ్ -అట్లీ జంటగా నటించిన ‘థేరి’ సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. ఇప్పటికే ఈ సినిమాకి స్క్రిప్ట్ కూడా లాక్ చేసినట్టు తెలుస్తుంది. విజన్ నటించిన ‘థేరి’ సినిమాకి తెలుగులో ‘పోలీసోడు’ పేరుతో ఆల్రెడీ డబ్బింగ్ వచ్చింది. కానీ అది పెద్దగా హిట్ సాధించలేదు. అయినా మళ్లీ అదే సినిమాని రీమేక్ చేయడానికి పవన్ రెడీ కావడంతో ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.

ఇది వరకే ఒకసారి పవన్ కళ్యాణ్ నటించిన ‘కాటమరాయుడు’ సినిమా విషయంలో కూడా అదే జరిగింది. అజిత్ నటించిన ‘వీరం’ సినిమాని తెలుగులో కాటమరాయుడు పేరుతో రీమేక్ చేశారు. ఇప్పుడు అలాంటి పనే చేస్తున్నారు. దాంతో అతను భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని చాలామంది అభిప్రాయపడుతున్నారు. నిజానికి ఇప్పుడు దర్శక నిర్మాతలు ప్రేక్షకులకు ఎటువంటి సినిమా నచ్చుతుందా అని నానా తిప్పలు పడుతుంటే, కొంతమంది మాత్రం ఆల్రెడీ వచ్చిన సినిమాలనే మళ్లీ రీమేక్ చేస్తున్నారు. ఈ రీమేక్‌లు చేయడం ఏంటో ఎవరికీ అర్థం కాని విషయం.

అయితే ఈ సినిమాలో ఒకప్పుడు రవితేజని హీరోగా పెట్టి రీమేక్ చేయాలని అనుకున్నారు. రవితేజ సరసన కాథరిన్‌ని హీరోయిన్‌గా ఫిక్స్ చేసినట్లు కూడా వార్తలు వచ్చాయి. కొన్ని రోజులకి ఆ వార్తల్లో నిజం లేదని తేలింది. ఆ తరువాత డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ ని హీరోగా తీసుకొని థేరి సినిమాని రీమేక్ చేయబోతున్నాడని వార్తలు వచ్చాయి. అంతా అయిపోతుందనే సమయానికి మైత్రి మూవీస్ మేకర్స్ నిర్మాతలు అదంతా అబద్ధం అని ఒక బాంబు పేల్చారు.

కాగా ఇప్పుడు ఫ్రెష్ గా మరి కొన్ని వార్తలు వస్తున్నాయి. వాటి ప్రకారం ప్రస్తుతం థేరి కథ పూర్తయిందని, ఆ కథని సెట్స్ పైకి తీసుకెళ్లడానికి పూజ కార్యక్రమాలు మొదలు పెట్టారని టాక్ నడుస్తోంది. ఇందులో నిజమెంతో తెలియదు గానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఖాళీగా లేరు. ‘హరిహర వీరమల్లు’,’ భవదీయుడు భగత్ సింగ్’, ‘వినోదయ సీతం’ వంటి చాలా సినిమాలు చేస్తున్నారు. అలాంటిది ఆయన మళ్లీ ఈ సినిమా ఎలా చేస్తాడు? ఉన్నదే మొదటి ముగించుకొని ఆ తర్వాతే కదా కొత్తగా ఒప్పుకునేది కానీ ఈ వార్తలను కొట్టి పారేస్తున్నారు. కాగా త్వరలోనే ఈ విషయం గురించి ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Tags: Ajith, director, Pawan kalyan, Teri remake, tollywood news