విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఈ సినిమా కారణంగా నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకు నష్టపరిహారం చెల్లించడానికి పూరి జగన్నాథ్, చార్మిలు సిద్ధమయ్యారు. డిస్ట్రిబ్యూటర్లు అందరితో మాట్లాడి ఎవరెవరికి ఎంత ఇవ్వాలి? ఈ వ్యవహారాన్ని ఎలా సెటిల్ చేయాలి? అనే విషయం గురించి నానా తంటాలు పడుతున్నారు. అయితే విజయ్ తాను ఈ సినిమా కోసం తీసుకున్న రూ.6 కోట్లు రెమ్యునరేషన్ తిరిగి ఇచ్చాడనే వార్త టాలీవుడ్‌లో వినపడుతోంది. ఆ విషయం తెలిసిన డిస్ట్రిబ్యూటర్లు విజయ్ ఆరు కోట్లు వెనక్కి ఇచ్చేశాడు కదా తొందరగా మా నష్టపరిహారం మాకు ఇచ్చేయండి అని పూరి, చార్మిలను మరింత ఒత్తిడికి గురి చేస్తున్నారట.
కానీ విజయ్ మాత్రం ఒక్క రూపాయి కూడా తన రెమ్యునరేషన్ నుంచి వెనక్కి తిరిగి ఇవ్వలేదని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. లైగర్ సినిమా ఫ్లాప్ అయిన తర్వాత విజయ్ దేవరకొండ తన సొంత పనులలో బిజీ గా వున్నాడట. కనీసం పూరి, చార్మిలకు కూడా టచ్ లో లేడని తెలుస్తుంది. పూరి జగన్నాథ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ అయిన ‘జనగణమన’ సినిమాలో కూడా విజయ్ దేవరకొండని హీరోగా తీసుకోవాలని ‘లైగర్’ సినిమా రిలీజ్ కి ముందు అనుకున్నాడు. కానీ ప్రస్తుతం తన నిర్ణయాన్ని మార్చుకొని ‘జనగణమన’ సినిమాని ఆపేయాలని ఉద్దేశంతో విజయ్ తో చర్చలు జరిగినట్టు తెలుస్తుంది.
అయితే లైగర్ సినిమా నష్టాల గురించి విజయ్ ని పారితోషం వెనక్కి ఇవ్వమనే టాపిక్ గురించి వీరి మధ్య రాలేదని అర్థమవుతుంది. లైగర్ సినిమా నష్టం మొత్తం పూరి జగన్నాథ్ తన నెత్తిన వేసుకున్నాడు. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాకి వచ్చిన లాభంతో పూరి హైదరాబాద్‌లో ఒక ప్రోపర్టీ కొన్నాడు. ప్రస్తుతం అది అమ్మేసి ఆ డబ్బుల్ని డిస్ట్రిబ్యూటర్లకు ఇవ్వాలని అనుకుంటున్నాడు. లైగర్ సినిమా నష్టపరిహారం చెల్లించడంలో విజయ్ కి ఎటువంటి వాటా లేదని స్పష్టంగా తెలుస్తుంది.