Balakrishna : నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం చేస్తున్న గోపీచంద్ మలినేని డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా తర్వాత బాలయ్య సక్సెస్ ఫుల్ డైరక్టర్ అనీల్ రావిపుడితో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో నయనతారని హీరోయిన్ గా తీసుకునే ఛాన్సులు ఉన్నట్టు టాక్. పటాస్ నుంచి ఎఫ్ 3 వరకు ఎంటర్టైనింగ్ సినిమాలు చేసిన అనీల్ రావిపుడి ఫస్ట్ టైం మాస్ మూవీ చేస్తున్నాడు.
ఈ సినిమాలో బాలయ్య క్యారక్టరైజేషన్ కొత్తగా ఉంటుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో మరో సర్ ప్రైజ్ ఏంటంటే హాట్ యాంకర్ అనసూయతో ఓ అదిరిపోయే ఐటం సాంగ్ ప్లాన్ చేస్తున్నారట. బాలయ్య (Balakrishna)తో ఐటం సాంగ్ అంటే అదికూడా అనసూయ లాంటి హాట్ బ్యూటీ అయితే అది మాములుగా ఉండదు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించబోతున్న ఈ సినిమాలో ఈ స్పెషల్ సాంగ్ హైలెట్ అవుతుందని అంటున్నారు.
ఇక అనసూయ విషయానికి వస్తే ఓ పక్క బుల్లితెర మీద తన షోస్ తో అలరిస్తూనే మరోపక్క సిల్వర్ స్క్రీన్ పై తన మెరుపులు మెరిపిస్తుంది. ఓ రకంగా చెప్పాలంటే ఓ చిన్న పాటి హీరోయిన్ రేంజ్ లో అనసూయ అదరగొడుతుంది. బాలయ్యతో స్పెషల్ సాంగ్ కోసం అనసూయ భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందని తెలుస్తుంది.