ప్రధాని మోడీకి సమంత సపోర్ట్.. మండిపడుతున్న నెటిజన్లు..

సెలబ్రిటీలు ఏదైన కామెంట్ చేసేటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఆ కామెంట్స్ ఎక్కడి వరకు ఎళ్తాయో చెప్పలేం.. అలా కామెంట్లు చేసి వివాదాల్లో చిక్కుకున్న వారు ఎంతో మంది ఉన్నారు. తాజాగా సమంత గతంలో చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ప్రధాని మోడీ, బీజేపీ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తూ సమంత గతంలో కీలక వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడు ఆ కామెంట్లపై నెటిజన్లు సమంతను ట్రోల్ చేస్తున్నారు. అంతేకాదు ఆమెకు ఎదురు ప్రశ్నలు ఎదురవుతున్నాయి..

ఇంతకు సమంత ఎందుకు ట్రోలింగ్ గురవుతుందంటే.. ఆమె గతంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో ప్రధాని మోడీని సపోర్ట్ చేస్తూ కామెంట్లు చేశారు. తాను మోడీ సపోర్టర్ అని, ఆయన చేసిన మంచి కార్యక్రమాలతో సంతోషంగా ఉన్నానని వ్యాఖ్యానించారు. ఆయన నాయకత్వంలో కచ్చితంగా మార్పు వస్తుందని నమ్ముతున్నానని చెప్పింది. ప్రధాని మోడీ దేశాన్ని ముందుకు నడిపిస్తారని, ఆర్థిక వ్యవస్థలో మార్పులు తీసుకొస్తారని సామ్ ఆ ఇంటర్వ్యులో చెప్పుకొచ్చింది.

సమంత ప్రధాని మోడీని సపోర్ట్ చేసిన ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. మోడీ పాలనలో జరుగుతన్న వ్యవహారాలను, ఆర్థికపరమైన అంశాలను బయటకు తీస్తూ ఆమెపై ఎటాక్ చేస్తున్నారు. ఎల్పీజీ సిలిండర్ రూ.1100 అయ్యిందని, ఆర్థివ వ్యవస్థలో మార్పు అంటే ఇదేనా? అంటూ సమంతకు చురకలు అంటిస్తున్నారు. మోడీ తీసుకున్న పథకాలు, నిర్ణయాలపై ఉన్న అసహనాన్ని సమంతపై వెల్లగక్కుతున్నారు.

మరికొందరైతే సమంత బీజేపీలో చేరుబోతుందని కామెంట్లు చేస్తున్నారు. ఎందుకంటే ఈ మధ్య బీజేపీ లీడర్స్ టాలీవుడ్ హారో, హీరోయిన్లతో కలుస్తున్నారు. దీంతో నెటిజన్లు ఆ కోణంలో కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం సమంత చేసిన యశోద, శాకుంతలం సినిమాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. అలాగే విజయ్ దేవరకొండతో కలిసి ఖుషి, అరేంజ్ మెంట్స్ ఆఫ్ లవ్ వంటి చిత్రాలతో బీజీగా ఉంది. ఓ బాలీవుడ్ సినిమాతో పాటు హాలీవుడ్ వెబ్ సిరీస్ కూడా చేస్తోంది. నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత తన కెరీర్ గ్రోత్ అనే అంశాన్ని సీరియస్ గా తీసుకుంది.

Tags: netizens, pm modi, Samantha, support, viral