Samantha : శాకుంతలం రిలీజ్ డేట్ లాక్.. గుణశేఖర్ ఏదో అద్భుతం చేసేలా ఉన్నాడే..!

Samantha Shakunthalam Release Date Poster gunasekhar Master Piece

Samantha : టాలీవుడ్ క్రేజీ డైరక్టర్స్ లో ఒకరైన గుణశేఖర్ సినిమా సినిమాకు గ్యాప్ తీసుకున్నా సరే క్వాలిటీ ప్రాజెక్ట్ ప్రేక్షకులకు అందిస్తారు. రుద్రమదేవి తర్వాత దాదాపు ఏడేళ్ల తర్వాత శాకుంతలం సినిమాతో వస్తున్నారు గుణశేఖర్. సమంత లీడ్ రోల్ లో వస్తున్న ఈ సినిమాలో దేవ్ మోహన్ కూడ దుష్యంతుడిగా నటిస్తున్నారు. మైథలాజికల్ మూవీగా వస్తున్న ఈ సినిమా నుంచి స్పెషల్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు.

సినిమా లో నటిస్తున్న దేవ్ మోహన్ బర్త్ డే సందర్భంగా అతని లుక్ రివీల్ చేయడమే కాకుండా సమంత, దేవ్ మోహన్ ఉన్న ఒక మోషన్ పోస్టర్ కూడా వదిలారు. ఈ పోస్టర్ లో సినిమా రిలీజ్ డేట్ కూడా లాక్ చేశారు. నవంబర్ 4న పాన్ ఇండియా రేంజ్ లో శాకుంతలం సినిమా రిలీజ్ అవుతుంది. గుణశేఖర్ సినిమా అంటేనేనే భారీతనం ఉంటుంది. ఇక మైథలాజికల్ మూవీ అంటే నెక్స్ట్ లెవల్ అని చెప్పొచ్చు.

జస్ట్ మోషన్ పోస్టర్ లోనే ఆ కోటలు చూపించి సర్ ప్రైజ్ చేశాడు. తప్పకుండా ఈ సినిమా మరోసారి తెలుగు సినిమా స్థాయిని పెంచేలా చేస్తుందని చెప్పొచ్చు. బాహుబలి తర్వాత తెలుగు సినిమాలు నేషనల్ వైడ్ గా సత్తా చాటుతున్నాయి. శాకుంతలం సినిమా కూడా హిందీ మార్కెట్ పై దుమ్ముదులిపేయడం పక్కా అని చెప్పొచ్చు. దిల్ రాజు సమర్పణలో నీలిమ గుణ నిర్మాతగా శాకుంతలం క్రేజీగా వస్తుంది. ఈ సినిమాలో సమంత పాత్ర సర్ ప్రైజ్ చేస్తుందని అంటున్నారు.

 

Tags: Dev Mohan, Gunasekhar, Samantha, Shakunthalam, Shakunthalam Release