Niveda Pethuraj : ఆల్రెడీ కోలీవుడ్ లో హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న నివేదా పేతురాజ్ తెలుగులో శ్రీ విష్ను హీరోగా వచ్చిన మెంటల్ మదిలో సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. స్టార్ హీరోయిన్ అయ్యే క్వాలిటీస్ అన్నీ ఉన్నా సరే అమ్మడికి ఎందుకో లక్ కలిసి రావట్లేదు. యువ హీరోల సరసన సినిమాలు చేస్తూ అలరిస్తున్న నివేదా ఓ పక్క హీరోయిన్ గా చేస్తూ మరోపక్క రేసర్ గా కూడా సత్తా చాటుతుంది. రేసర్ అవ్వాలనే తన కలని నిజం చేసుకునేందుకు ప్రయత్నలు చేస్తుంది అమ్మడు.
ఇక హీరోయిన్స్ అంతా కూడా సినిమాలతో పాటుగా తమ ఫోటో షూట్స్ తో ప్రేక్షకులను అలరిస్తారు. నివేదా పేతురాజ్ కూడా పెద్దగా గ్లామర్ షో చేయకపోయినా అమ్మడి లుక్స్ కి మాత్రం ఆడియన్స్ ఫిదా అవుతారు. కళ్లతోనే మాయ చేసే ఈ అమ్మడు లేటెస్ట్ గా రెడ్ కాస్టూం తో ఫోటో షూట్ చేసింది. తనని చూసి ఒక్కసారిగా చూపు మరల్చుకోలేం అనే విధంగా అమ్మడి అందం ఉంది.
తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేస్తూ వస్తున్న నివేదా.. తన మార్క్ నటనతో ఆకట్టుకుంటుంది. తన గ్లామర్ సైడ్ కూడా చూపించేందుకు రెడీ అంటున్న నివేదా అలాంటి పాత్ర తనకు రావాలని అంటుంది. పాత్ర ప్రాధాన్యతని బట్టి నివేదా కూడా రెచ్చిపోవడానికి రెడీ అని చెబుతుంది.