Prabhakar : బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ తనయుడు చంద్రహాస్ హీరోగా ఈమధ్యనే తొలి సినిమా మొదలైంది. అతన్ని పరిచయం చేస్తూ రీసెంట్ గా ఓ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. అయితే ఆ ప్రెస్ మీట్ లో చంద్రహాస్ యాటిట్యూడ్ చూపించాడని.. కొత్త హీరోకి అంత యాటిట్యూడ్ ఉంటే ఇండస్ట్రీలో పైకి రావడం కష్టమని ఒక ఆట ఆడేసుకున్నారు ట్రోలర్స్. ఓ విధంగా చంద్రహాస్ ఎపిసోడ్ వారికి ఒక మంచి స్టఫ్ అనిపించింది.
ఓ రేంజ్ లో అతని మీద ట్రోల్స్ వచ్చాయి. అయితే దీనిపై ప్రభాకర్ స్పందించిన తీరు అందరిని ఆశ్చర్యపరచింది. తన కొడుకు తొలి ప్రయత్నాన్ని ట్రోలర్స్, మీడియా తప్పుపడుతుందని ఫైర్ అవుతాడని అనుకుంటే ఆయన వెరైటీగా మా వాడు ఆరోజు నడుచుకున్న విధానం చూసి వాళ్లు అలా రెస్పాండ్ అవడం మాములే. వాళ్లకి ఏదనిపిస్తే అలా అనే హక్క్ వారికి ఉందని అన్నాడు.
చంద్రహాస్ ని చూసి అతనికి యాటిట్యూడ్ అని రాసిన ఈ ట్రోలర్స్, మీడియా వాళ్లే తన నటన బాగుంటే మెచ్చుకుంటారని. అందుకే ట్రోల్స్ మీద తను ఎలాంటి ఇబ్బంది ఫీల్ అవలేదని అన్నారు ప్రభాకర్. అంతేకాదు నెగటివ్ అయినా పాజిటివ్ అయినా జనాల్లోకి వెళ్లడం ఇంపార్టెంట్ అని అన్నారు. కొడుకుని ఓ రేంజ్ లో ట్రోల్ చేసినా ప్రభాకర్ స్పందించిన తీరు మాత్రం సూపర్ అనేస్తున్నారు ఆడియన్స్.