కస్టడీ సినిమా ఫ్లాప్.. మాజీ మొగుడికి మైండ్ బ్లోయింగ్ షాక్ ఇచ్చిన సమంత.. దెబ్బ మామూలుగా లేదుగా..?

సమంత – నాగచైతన్య ఈ జంటకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రెండేళ్ల క్రితం వీరిద్దరూ కొన్ని పర్సనల్ కారణాల‌తో విడాకులు తీసుకున్నారు. ఇప్పటికీ చాలామంది అభిమానులు వీరిద్దరూ మళ్ళీ కలిస్తే బాగుంటుంద‌నే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అయితే అది జరిగే పని కాదు. ఇటీవల సమంత – నాగచైతన్య ఇద్దరు ఒకరిపై ఒకరు చేసుకుంటున్న కామెంట్స్ అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఈ వార్తలు వింటే త్వరలోనే ఈ జంట కలవబోతున్నారేమో అన్న‌ అనుమానం కలుగుతుంది.

తాజాగా నాగచైతన్య హీరోగా కృతి శెట్టి హీరోయిన్‌గా క‌స్ట‌డి సినిమా విడుదలైంది. ఈ సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న నాగచైతన్య.. సమంత గురించి అడిగిన ప్రశ్నలకు స్పందించిన విధానం అందర్నీ ఆశ్చర్యపరిచింది. సమంత చాలా మంచి వ్యక్తి అని సోషల్ మీడియాలో వచ్చిన ఊహాగానాల వల్లే మేమిద్దరం విడిపోయామన్నాడు.

అలా తన విడాకులపై స్పందించడంతోపాటు.. ఆమె చాలా హార్డ్ వర్కర్ అని ఈ విషయం సమంతలో నాకు బాగా నచ్చుతుందని పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు. దీన్ని బట్టి సమంతపై నాగచైతన్యకు ఎటువంటి కోపం లేదని విషయం అర్ధం అవుతుంది. అలాగే మరో వార్త సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. సమంత.. నాగచైతన్య నటించిన కస్ట‌డి సినిమా చూసిందంటున్నారు కూడా…!

సినిమాలో నాగచైతన్య ఒక రెస్పాన్సిబుల్ పోలీస్ మెన్ గా చాలా బాగా నటించారని.. ఈ సినిమా చాలా బాగుందని నాగచైతన్యకు కచ్చితంగా హిట్ తెచ్చిపెడుతుందని తన సన్నిహితులతో సమంత పంచుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విష‌యం ఇప్పుడు ఇండ‌స్ట్రీ ఇన్న‌ర్ వ‌ర్గాల్లో పెద్ద హాట్ టాపిక్గా మారింది.

Tags: celebrities news, custody, latest film news, latest filmy updates, latest news, naga chaithanya, Samantha, social media, Star hero, Star Heroine, telugu news, Tollywood, viral news