పవన్ కళ్యాణ్ ఫస్ట్ వైఫ్ నందిని గురించి టాప్ సీక్రెట్స్ ఇవే… ఆమె ఏం చేస్తోందో తెలుసా..?

తెలుగు చిత్ర పరిశ్రమలో పవన్ కళ్యాణ్ ఎంత పెద్ద స్టార్ హీరోగా కొనసాగుతున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హిట్, ప్లాప్‌లతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ తన అభిమానుల సంఖ్యను అంతకంతకు పెంచుకుంటూ పోతున్నాడు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో పాటు వరుస‌ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇదే సమయంలో పవన్ రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత ఆయన వ్యక్తిగత జీవితంలో జరిగిన మూడు పెళ్లిళ్ల విషయంపై ఎప్పుడు వార్తలో నిలుస్తూనే ఉంటాడు.

Pawan Kalyan's two failed marriages to his secret wedding with Anna  Lezhneva; A look at Power Star's love life | PINKVILLA

ప్రత్యర్థి పార్టీల నేతలు అందరూ కూడా పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల గురించి ఎప్పుడూ ప్రస్తావన తీసుకొస్తూ విమర్శలు చేస్తూనే ఉంటారు. అయితే రేణు దేశాయ్ కి విడాకులు ఇచ్చిన పవన్ కళ్యాణ్ రష్యన్ అమ్మాయి అన్నా లెజెనోవాను పెళ్లి చేసుకున్నాడు. పవన్ కళ్యాణ్ 1997లో విశాఖకు చెందిన నందిని రెడ్డి అనే అమ్మాయిని ముందుగా వివాహం చేసుకున్నారు.

అప్పుడు ప‌వ‌న్ సినిమాల్లోకి రాలేదు. ఇక వీరి వివాహం కుటుంబ సభ్యుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. కొద్ది రోజుల తర్వాత ఇద్దరి మధ్య గొడవలు రావడం.. చివరకు అది విడాకులకు దారి తీసింది. ఆమె స్వ‌స్థ‌లం వైజాగ్‌. ప‌వ‌న్‌కు విడాకులు ఇచ్చేశాక ఆమె ఓ డాక్ట‌ర్‌ను మ‌ళ్లీ పెళ్లి చేసుకున్నారు. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ మొదటి భార్య నందినీ రెడ్డి గురించి కొన్ని ఆసక్తికర వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Pawan Kalyan family, childhood photos | Celebrity family wiki

నందిని జాహ్నవిగా పేరు మార్చుకొని 2010లో డాక్టర్ కృష్ణారెడ్డిని వివాహం చేసుకుంది. ప్రస్తుతం త‌న‌ కుటుంబంతో కలిసి అమెరికాలో ఉంటున్నట్లు తెలుస్తోంది. వీళ్లకు రూ. 500 కోట్ల వరకు ఆస్తులు ఉన్నట్టు సమాచారం. అంతేకాదు ప్రస్తుతం ఈమె అక్కడే భర్తతో తన జీవితాన్ని సంతోషంగా కొనసాగిస్తోందట.