కృష్ణంరాజు నన్ను టార్చ‌ర్‌ పెట్టారు. స్టార్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు..!

స్టార్ హీరో కృష్ణంరాజు సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సినిమా ఛాన్సుల కోసం ఎంతో కష్టపడ్డారు. రాజుల కుటుంబంలో పుట్టిన కృష్ణంరాజు ఆయన తండ్రి సంపాదించిన ఆస్తులు కోట్లలో ఉన్నా సినిమాలపై ఉన్న ఆసక్తితో మొగల్తూరు నుంచి చెన్నైకి వచ్చారు. తండ్రి సహాయం కోరకుండా తన కష్టంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టి హీరోగా ఎదిగారు. మొదట్లో ఆయనకు హీరో ఛాన్స్ వచ్చినా ఆ సినిమా సక్సెస్ కాలేదు.

అయితే ఆ తరువాత ఆయనకు వరుసగా విల‌న్ ఆఫ‌ర్లు రావ‌డంతో ఆ పాత్ర‌లే చేసేవారు. అలా కృష్ణంరాజు అక్కినేని నాగేశ్వరరావు హీరోగా నటించిన మంచి రోజులు వచ్చాయి సినిమాలో విలన్ గా నటించాడు. ఈ సినిమాలో నాగేశ్వరరావుకు చెల్లెలిగా గీతాంజలి రామకృష్ణ నటించింది. కాగా గీతాంజలి కొన్ని సంవత్సరాల క్రితం ఒక‌ ఇంటర్వ్యూలో కృష్ణంరాజు విల‌నిజ‌మ్ ఓ రేంజ్ లో ఉండేదని చెప్పింది.

అప్పట్లో నేను మంచి రోజులు వచ్చాయి అనే సినిమాలో నటించాను. అందులో నాది నాగేశ్వరరావు గారి చెల్లెలు పాత్ర. కృష్ణంరాజుకి , నాకు ఒక సన్నివేశం ఉంటుందని.. నేను కృష్ణంరాజు మొహం మీద ఉమ్మివేస్తాను… దానికి ఆయన నా మీద కోపంతో నాపై ఉమ్మేస్తావా అంటూ నా బట్టలు చించి నా జుట్టు పట్టుకుని పీకుతారు చివరకు నా మీదకు కుక్కని వదిలేస్తాడ‌ని చెప్పింది.

ఇలా ఆ సీన్లో న‌న్ను ప‌లు విధాలా చిత్రహింసలు పెడతాడు.. ఇలాంటి సన్నివేశం చేసేటప్పుడు ఆయన నిజంగానే నన్ను చాలా సీరియస్ గా అరిచారని.. దాంతో నేను చాలా భయపడిపోయానని ఆమె చెప్పుకొచ్చింది. అయితే ఆమె చేసిన వ్యాఖ్యలు వింటున్నప్పుడు ఈ రోజుల్లోనే కాక ఆ రోజుల్లోనూ సినిమాల కోసం నిజంగానే కొట్టుకునేవారా ? అని షాక్ అవుతాం.

ప్రస్తుతం ఉన్న స్టార్ట్ స్టేటస్ వల్ల‌ చాలామంది స్టార్ హీరోలు.. విలన్ పాత్రలు చేయడానికి భయపడుతున్నారు కానీ అప్పట్లో చిరంజీవి, కృష్ణంరాజు లాంటి వారు ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలోనే క్యారెక్టర్ ఆర్టిస్టులుగా నటించి ఆ తరువాత మెల్లమెల్లగా స్టార్ హీరోస్ గా గుర్తింపు తెచ్చుకున్నారు.

Tags: celebrities news, geethanjali, Krishnam Raju, latest film news, latest filmy updates, latest news, social media, Star hero, Star Heroine, telugu news, Tollywood, viral news