ఆ సినిమా అట్ట‌ర్ ప్లాప్‌… ర‌వితేజ‌కు ముందే ఫోన్ చేసిన చెప్పిన స‌మంత‌..!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్ర‌స్తుతం విజయ్ దేవరకొండ సరసన ఖుషి సినిమాలో న‌టిస్తుంది. అలాగే బాలీవుడ్‌లో సెట్టాడెల్‌లో వెబ్ సిరీస్ లోను నటించి షూటింగ్ కు బ్రేక్ ఇచ్చిన సమంత ఏడాదిపాటి సినిమాలు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. మ‌యోసైటీస్‌ వ్యాధితో బాధపడుతున్న సమంత ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళ్లాలని నిర్ణయించుకుందట.

ఇక సమంత ఎప్పటికప్పుడు తాను నటించబోయే కథల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తుంది. ఇటీవల ఈమె నటించిన శాకుంతల, యశోద ఫ్లాప్స్ అయిన అంతకు ముందు వరకు ఈమె నటించిన దాదాపు అన్ని సినిమాలు హిట్ అయ్యాయి. ఇక గతంలో రవితేజ హీరోగా తెర‌కెక్కిన మాస్ మహారాజ్ మూవీలో ఫస్ట్ సమంతని హీరోయిన్గా అనుకున్నారట.

డైరెక్ట‌ర్‌ శీను వైట్ల కథను సమంతకు వినిపించగా ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అవుతుంది నేను నటించినని చెపింద‌ట‌. రవితేజకు కూడా ఫోన్ చేసి ఈ సినిమా అట్టర్ ప్లాప్ అవుతుంది అని చెప్పేసింది అంటూ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అన్నట్లు ఈ సినిమా రిలీజై బాక్సాఫీస్ వద్ద నిజంగానే ప్లాప్ అయ్యింది.