త్వరలోనే మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ భోళా శంకర్ ‘ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సందడి చేసింది ‘ భోళా శంకర్ ‘ మూవీ టీం. మరికొద్ది రోజుల్లో విడుదల కాబోతున్న ఈ సినిమా గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ సినిమాలో శ్రీముఖి పాత్ర కోసం మొదటిగా అనుకున్నది ఆమెను కాదట మరో స్టార్ నటినీ ఈ పాత్ర కోసం అనుకుంటే చిరంజీవి ఆమెను వద్దనారట.
ఆమె పాత్రలో శ్రీముఖిని తీసుకోమనడంతో శ్రీముఖి ఆ పాత్రలోకి వచ్చింది అంటూ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆమె ఎవరో కాదు జబర్దస్త్ కమెడియన్ రోహిణి. మొదట మెహర్ రమేష్, రోహిణిని శ్రీముఖి పాత్రకు అనుకున్నాడట. చిరంజీవికి శ్రీముఖి పాత్రకు మధ్యన కొన్ని కామెడీ సన్నివేశాలు ఉంటాయి. కామెడీ సన్నివేశాలు అంటే కమెడియన్ తీసుకుంటే పర్ఫెక్ట్ గా ఉంటుందని ఉద్దేశంతో మెహర్ రమేష్ మొదట రోహిణిని సినిమాకు అనుకున్నారట.
కానీ చిరంజీవికి చెబితే అమ్మో ఆ అమ్మాయి కామెడీ అసలు మామూలుగా ఉండదు ఆమె కామెడీ చేస్తే నేను కూడా పనికిరాను రోహిణి వద్దు రోహిణి పాత్రలో వేరే అమ్మాయిని పెట్టండి అంటు చిరంజీవి చెప్పారట. దాంతో రోహిణి పాత్రలో శ్రీముఖినీ తీసుకున్నారని కానీ కరెక్ట్ గా చెప్పాలంటే ఆ పాత్రకి రోహిణి మాత్రమే సెట్ అవుతుందని తెలుస్తుంది. ఈ న్యూస్ వైరల్ అవ్వడంతో రోహిణిని వద్దని శ్రీముఖి తీసుకోవడం వెనుక వేరే ఏదో కారణం ఉందింటూ కావాలనే చిరంజీవి రోహిణిని ఇలాంటి మంచి యాక్టర్ ని తీసేసారు అంటూ జనం కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా చిరంజీవి సినిమాలో రోహిణి నటించే ఛాన్స్ మిస్సయింది.