ఎట్టకేలకు మెగాస్టార్ చిరంజీవి ఏపీ ప్రభుత్వంపై కాస్త ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చిరంజీవి నర్మగర్భ వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. చివరకు ఏపీ ప్రభుత్వం టిక్కెట్లతో పాటు సినిమా రిలీజ్ ల విషయంలో.. బెనిఫిట్ షో ల విషయంలో ఇండస్ట్రీని ఎన్ని ఇబ్బందులు పెట్టిన కూడా చిరంజీవి జగన్‌కు దండం పెట్టి వినమ్రంగా వేడుకున్నారే తప్ప ఏనాడు చిన్న విమర్శకు కూడా చేసేందుకు ఇష్టపడలేదు.
చివరకు సినిమా హీరోలు అందరూ వెళ్లి జగన్ ను కలిసినప్పుడు కూడా చిరంజీవి రెండు చేతుల జోడించి జగన్ను దేవుడుగా కీర్తిస్తూ విజ్ఞప్తి చేయటం చిరంజీవి అభిమానులకే ఎంత మాత్రం నచ్చలేదు. చిరంజీవి పూర్తిగా జగన్నామస్మరణ చేస్తున్నారన్న సెటైర్లు కూడా అప్పట్లో ఆయనపై పడ్డాయి. అయితే ఎట్టకేలకు ఇప్పుడు చిరంజీవి వాల్తేరు వీరయ్య 200 రోజుల ఫంక్షన్ లో తాజా రాజకీయాలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
గత కొనేళ్లుగా సినీ పరిశ్రమను చుట్టూ ముడుతున్న రాజకీయ అంశాలపై ఆయన మాట్లాడారు. మీలాంటి వాళ్ళు ప్రత్యేక హోదా గురించి, రోడ్ల నిర్మాణం.. ప్రాజెక్టులు.. ఉద్యోగ ఉపాధి అవకాశాల గురించి ఆలోచించాలి.. పేదవారి కడుపు నింపే దిశగా ఆలోచించాలి.. అలా చేస్తే అందరూ మీకు తలవంచి నమస్కరిస్తారు.. అంతేగాని పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా సినిమా పరిశ్రమపై పడతారేంటి అంటూ చురకలు అంటించారు.
ఏది ఏమైనా చిరంజీవి జగన్ పై ఈమాత్రం ఘాటు వ్యాఖ్యలు అయినా చేయటానికి కారణం ఏంటి ? వచ్చే ఎన్నికల్లో వైసిపి గెలవదు.. జగన్ నుంచి ఎలాంటి ? ఇబ్బంది ఉండదు అని తెగించి ఈ వ్యాఖ్యలు చేశారా ? అన్న సెటైర్లు కూడా ఇప్పుడు పడుతున్నాయి.