కండ‌లు చూపిస్తూ రెచ్చిపోయిన స‌మంత‌… యాక్ష‌న్ అంటూ క్యాప్ష‌న్‌…!

స్టార్ హీరోయిన్ సమంత ఏ మాత్రం గ్యాప్ లేకుండా సినిమాలో లేదా వెబ్‌సీరిస్‌లో చేసుకుంటూ పోతోంది. శాకుంత‌లం సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఇక త్వ‌ర‌లోనే ఖుషితో మ‌రోసారి ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. అలాగే సిటాడెల్ వెబ్ సీరిస్ లో కూడా న‌టిస్తోంది. స‌మంత ఏం చేసినా.. ఏం మాట్లాడినా సంచ‌ల‌న‌మే అవుతోంది.

Makers of Kushi release new poster on Samantha's birthday- Cinema express

రీసెంట్‌గా శాకుంత‌లం డిజాస్ట‌ర్ కావ‌డంతో ఆ షాక్ నుంచి సామ్ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. క‌ష్ట‌ప‌డ‌డ‌మే మ‌న బాధ్య‌త‌.. ఫ‌లితం మ‌న చేతుల్లో లేదు.. అంటూ క‌ర్మ సిద్ధాంతాన్ని కూడా సామ్ చెపుతోంది. ప్ర‌స్తుతం స‌మంత విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు జోడీగా ఖుషి సినిమా చేస్తోంది. ఇక జొన్న‌ల‌గ‌డ్డ సిద్ధ‌కు జోడీగా కూడా మ‌రో సినిమాలో న‌టిస్తోంద‌న్న టాక్ వ‌చ్చింది.

Kushi poster: Samantha calls her film with Vijay Deverakonda 'explosion of  joy' - Hindustan Times

సోష‌ల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే స‌మంత తాజాగా ఇన్ స్టా వేదిక‌గా ఓ పోస్ట్ షేర్ చేసింది. అందులో త‌న కండ‌లు చూపిస్తూ రెచ్చిపోయింది. త‌న మోచేతిని టేబుల్ మీద పెట్టి ఫొటో తీసింది.. అలాగే మై లవ్ స్టోరీ విత్ యాక్షన్ అంటూ క్యాప్షన్ అంటూ కామెంట్ చేసింది. ఈ ఫొటోలో సామ్ చేయి చాలా స్ట్రాంగ్‌గా ఉంది.

Kushi | Samantha Ruth Prabhu and Vijay Deverakonda-starrer Kushi to release  on September 1 - Telegraph India

తెల్ల‌గా మెరిసిపోతోంది. ఆమె మృదువైన చేయి బాగా క‌ష్ట‌ప‌డి కందిపోయిన‌ట్టుగా కూడా ఉంది. ఈ ఫొటో చూస్తుంటేనే సామ్ ఎంత క‌ష్ట‌ప‌డుతుందో తెలుస్తోంది.. ఇక త‌న‌కు యాక్ష‌న్ సినిమాపై ఉన్న ఇష్టం వ‌ల్లే ఇంత‌గా క‌ష్ట‌ప‌డుతున్న‌ట్టుగా ఆమె క్యాప్ష‌న్ చెప్ప‌క‌నే చెపుతోంది. ఈ పోస్టు, ఆ ఫొటో చూస్తుంటే స‌మంత సిటాడెల్ వెబ్‌సీరిస్ షూటింగ్‌లో పాల్గొంటున్న‌ట్టు అర్థ‌మ‌వుతోంది.

కొద్ది రోజుల వ‌ర‌కు మయోటైటిస్ అనే వ్యాధితో బాధ పడిన సామ్ దాని నుంచి కోలుకుని ఇప్పుడు వ‌రుస‌గా షూటింగ్‌ల మీద షూటింగ్‌లు చేస్తోంది.