సినిమాల్లో ప‌నైపోయింద‌న్న టైంలో జూలు విదిల్చి ఎన్టీఆర్ ఇచ్చిన షాక్ ఇదే…!

నందమూరి తారక రామారావు.. ఈ పేరుకే ఓ చరిత్ర ఉంది.. కాదు కాదు ఈ పేరుతోనే ఓ చరిత్ర రాయొచ్చు. తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ప్రత్యేకమైన పేజీని కాదు గ్రంథాన్ని లిఖించుకున్న మహానటుడు ఎన్టీఆర్. ఆయన పేరు చెబితే పులకించని తెలుగువాడు ఉండడేమో..? ముందు కథానాయకుడిగా.. ఆ తర్వాత మహానాయకుడిగా తన రాజకీయ చతురతతో ఎన్నో స్కీములు తీసుకొచ్చి పేదల దేవుడిగా మారారు.

Daana Veera Soora Karna Movie || Sr.NTR Fools At Maya Sabha || NTR ,  Sharada || Shalimarcinema - YouTube

అది 1977.. అప్పటికే ఎన్టీఆర్ సినిమాలు వస్తున్నాయి. కానీ ఒకప్పటిలా మాత్రం విజయం సాధించడం లేదు. బ్లాక్‌బస్టర్స్ కొడుతున్నాడు కానీ బాక్సాఫీస్ బద్దలైపోయే రికార్డులు మాత్రం రావడం లేదు. ఎన్టీఆర్ ఆ తర్వాత కాలంలో కృష్ణ, శోభన్ బాబు వంటి వాళ్ళు రావడంతో కాస్త జోరు తగ్గింది. కొంద‌రు అయితే ఇక సినిమాల్లో ఎన్టీఆర్ ప‌నైపోయింద‌న్న వాళ్లూ ఉన్నారు. అయితే వయసైపోతుంది కదా అని ఊరికే ఉండలేదు.. జూలు విదిల్చిన సింహంలా ఆయన గర్జించాడు. సినిమా ఇండస్ట్రీలో తనకు తిరుగులేదని మరోసారి నిరూపించాడు.

YAMAGOLA Telugu Full Movie | NTR | Jaya Pradha | Rao Gopal Rao | 1977's  Telugu Hits | Rajshri Telugu - YouTube

మరోవైపు నందమూరి అభిమానులు కూడా తమ హీరో విజృంభన కోసం చూస్తున్న తరుణంలో ఆ సమయం రానే వచ్చింది. ఒకే ఏడాది ఏకంగా మూడు ఇండస్ట్రీ విజ‌య‌ల‌ను ఇచ్చి ఎన్టీఆర్ అంటే ఏంటో మరోసారి నిరూపించాడు తారకరాముడు. 1977లో ఏకంగా మూడు బ్లాక్ బస్టర్ చిత్రాలు ఉన్నాయి. జనవరి 18న రిలీజ్ అయిన దానవీరశూరకర్ణ బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. ఇందులో ఎన్టీఆర్‌ ఏకంగా మూడు విభిన్నమైన పాత్రలు పోషించి అందరినీ ఆకట్టుకున్నారు. పైగా ఈ సినిమాకు ద‌ర్శ‌కుడు, నిర్మాత కూడా ఆయ‌నే.

Adavi Ramudu (1977) - IMDb

ఈ సినిమా విజయం మర్చిపోకముందే రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన అడవి రాముడు మరో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టింది. అలాగే ఆ ఏడాది చివరలో యమగోల రిలీజ్ అయి బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది. ఇలా 1977లో మూడు సినిమాలు చేసి ఇండస్ట్రీ హిట్ కొట్టి చరిత్రను తిరగరాశారు. ఎన్టీఆర్ సినీ కెరీర్ లోనే ఇది ఓ మరుపురాని రికార్డు అని చెప్పవచ్చు.