అనుష్క‌కు క్యాస్టింగ్ కౌచ్ త‌ప్ప‌లేదా… ఎలా త‌ప్పించుకుందో ఆ సీక్రెట్ బ‌య‌ట పెట్టిందిగా…!

 

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన హీరోయిన్లలో అనుష్క శెట్టి కూడా ఒకరు.. మొదట సూపర్ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించింది. పలు లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో కూడా నటించి తనకంటూ ఒక సపరేటు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకుంది అనుష్క.

Vedam (2010) - Photo Gallery - IMDb

గత కొద్దిరోజులుగా క్యాస్టింగ్ కౌచ్ అనేది సినీ ఇండస్ట్రీలో ఎంత సంచలనంగా మారిందో చెప్పాల్సిన పనిలేదు.. ఈ విషయంపై అనుష్క కీలకమైన వ్యాఖ్యలు చేసింది వాటి గురించి తెలుసుకుందాం. గత కొద్ది రోజుల నుండి కాస్టింగ్ కౌచ్ అనేది సినీ ఇండస్ట్రీలో చాలా సంచలనంగా మారింది.. ఎవరో ఒకరు వచ్చి మీడియా ముందుకు క్యాస్టింగ్ కౌచ్ పైన తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. క్యాస్టింగ్ కౌచ్ భారిన పడ్డ భామలు నిర్భయంగా బయటకి వచ్చి పలు నిజాలను సైతం తెలియజేస్తూ ఉన్నారు.

Anushka Shetty All Fans | Facebook

 

స్టార్ హీరోయిన్ అనుష్క కూడా ఇండస్ట్రీలో ఇలాంటి వేధింపులకు గుర‌య్యాన‌ని చెప్పి ఒక్కసారిగా షాక్ ఇచ్చింది.. గతంలో ఒక సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ ముద్దుగుమ్మ ఒక ఇంటర్వ్యూలో పాల్గొనడం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను కూడా సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ వల్ల ఇబ్బంది పడ్డానని వెల్లడించింది.సిని రంగంలో ఇటువంటి వేధింపులు తరచూ చాలామంది హీరోయిన్లకు సైతం ఎదురవుతున్నాయి..కెరియర్ స్టార్టింగ్ లో తనకి కూడా ఇలాంటివి చాలానే ఎదురయ్యాయని చెప్పింది.

Throwback Thursday 10 Years of Anushka shetty Allu Arjun Starrer Vedam

అయితే తాను స్ట్రైట్ ఫార్వార్డ్ గా ధైర్యంగా ఉండడం వల్ల క్యాస్టింగ్ కౌచ్ నుంచి తప్పించుకోగలిగానని తెలియజేసింది. ముఖ్యంగా ఇలాంటివి ఇండస్ట్రీలో కొత్తగా ఎంట్రీ ఇచ్చే వారికి ఎదురవుతూ ఉంటాయని తెలిపింది అనుష్క శెట్టి. ఇటీవ‌ల‌ అనుష్క సినిమాలు ఏవి విడుదల కాలేదు.. ప్రస్తుతం నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తున్న చిత్రంలో మాత్రమే నటిస్తోంది. ముఖ్యంగా అనుష్క శెట్టి వివాహం కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ ఏడాదైన ఈ అమ్మడు పెళ్లి విషయాన్ని తెలియజేస్తుందేమో చూడాలి మరి.