రెండో పెళ్లికి రెడీ అయిన సమంత..? ఆ వార్తలపై ఫుల్ క్లారిటీ!

విడాకులు తీసుకున్న తర్వాత సమంతపై ఎన్నడూలేని విధంగా విమర్శలు వచ్చాయి. అంతేకాదు దారుణమైన ఆరోపణలు కూడా హల్ చల్ చేశాయి. మరీ ముఖ్యంగా నెటిజన్లు ఆమెను ఎంతగానో ట్రోల్ చేశారు. నాగచైతన్య నుంచి భారీ మొత్తంలో డబ్బు తీసుకుందని నిరాధార వ్యాఖ్యలు కూడా చేశారు. ఇప్పటికీ ఆమెపై ఎన్నో పుకార్లను సృష్టిస్తున్నారు. అయితే తాజాగా సామ్‌ రెండో పెళ్లి చేసుకోబోతుందని మరో కొత్త పుకారు సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది. అయితే దీనిపై తాజాగా సామ్‌ సన్నిహితులు క్లారిటీ ఇచ్చారు.

చైతు నుంచి డివోర్స్ తీసుకున్నాక సమంత మానసికంగా ఎంతో కుంగిపోయిందని.. దానికి తోడు సూటిపోటి మాటలు వల్ల మరింత మానసిక క్షోభకు గురి అయిందని వార్తలు వచ్చాయి. అలాంటి సమయంలో సద్గురు వాసుదేవ్ సమంతకి మెంటల్ సపోర్ట్ అందించాడట. అంతేకాదు అతని సలహాతోనే రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైందని రూమర్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలోనే సమంతకి దగ్గర అయిన వారు ఈ విషయంపై స్పందించారు. సమంత రెండో పెళ్లి చేసుకుంటుందని వస్తున్న రూమర్స్‌లో వాస్తవం లేదని క్లారిటీ ఇచ్చారు.

సమంత పెళ్లికి, సద్గురుకి మధ్య ఎలాంటి సంబంధం లేదని కూడా వారు స్పష్టంచేశారు. ప్రస్తుతం సమంతకి కాస్త అనారోగ్యంగా ఉందని, ఆ తర్వాత ఆమె మళ్లీ తన సినిమాలతో బిజీ అవుతుందని అంటున్నారు. మొదటగా బాలీవుడ్, ఆపై హాలీవుడ్ సినిమాలు తీసే స్థాయికి ఎదగాలని ఆమె ప్రయత్నిస్తోందని.. అంతే తప్ప రెండో పెళ్లి గురించి ఆలోచన అసలు చేయడం లేదని వారు చెబుతున్నారు. ఇదిలా ఉండగా సమంత టైటిల్ రోల్లో నటించిన శాకుంతలం సినిమా నవంబర్ 4 వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. దీనిని డైరెక్టర్ గుణ శేఖర్ రూపొందించారు.

Tags: Naga Chaitanya, Sadhguru Jaggi Vasudev, Samantha Ruth Prabhu, second husband, Second Marriage, shakuntalam cinema