Rashmika : కన్నడ భామ రష్మిక మందన్న ఓ పక్క వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నా సరే అమ్మడి తన సోషల్ మీడియా ఫ్యాన్స్ ని అలరించడంలో వెనక్క్ తగ్గట్లేదు. ఎవరైనా ఫాం లో లేని భామలు గ్లామర్ షోతో రెచ్చిపోతారు కానీ రష్మిక ఓ రేంజ్ ఫాం కొనసాగిస్తూనే అదందంగా అందాల విందు అందిస్తుంది. లేటెస్ట్ గా అమ్మడు గోల్డెన్ డ్రెస్ అంటూ చేసిన హాట్ షోకి అందరు ఫిదా అయ్యారు.

ఏమ్మా శ్రీవల్లి ఏందీ అందాల రచ్చ అనుకోవడం ఆడియన్స్ వంతు అయ్యింది. రష్మిక చేస్తున్న ఈ హాట్ షోకి ప్రేక్షకులకు నిద్ర పట్టడం లేదని చెప్పొచ్చు. ప్రస్తుతం తెలుగులో పుష్ప 2, తమిళంలో వారసుడు సినిమాలు చేస్తున్న రష్మిక బాలీవుడ్ లో గుడ్ బై, మిషన్ మజ్ఞు సినిమాల్లో నటిస్తుంది. ఈ సినిమాలతో హిందీ ఆడియన్స్ ని కూడా రష్మిక తన బుట్టలో వేసుకోవాలని చూస్తుంది.

సినిమాలతో సంబంధం లేకుండా రష్మిక చేస్తున్న ఈ గ్లామర్ షో ఆడియన్స్ ని తెగ డిస్ట్రబ్ చేస్తుంది. తెలుగు, తమిళమే కాదు బాలీవుడ్ లో కూడా అమ్మడు అదరగొట్టేలా ఉంది. రష్మిక దూకుడు చూస్తుంటే అమ్మడి రచ్చ మరో ఐదేళ్లు కొనసాగించేలా ఉంది. పుష్ప 2 తో కూడా మరోసారి బాలీవుడ్ ఆడియన్స్ ని మెప్పించనుంది రష్మిక.