Krithi Shetty : 2022.. నాలుగు సినిమాలతో బేబమ్మ హవా..!

ఉప్పెన సినిమాతో సూపర్ సెన్సేషన్ అనిపించిన కృతి శెట్టి (Krithi Shetty) వరుస సినిమాలతో సత్తా చాటుతుంది. 2022 జనవరి నుంచి అమ్మడు వరుసగా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. సంక్రాంతికి బంగార్రాజు సినిమాతో అలరించగా ఆ తర్వాత రాం ది వారియర్ సినిమాతో వచ్చింది. ఇక రీసెంట్ గా నితిన్ మాచర్ల నియోజకవర్గం సినిమాలో నటించింది.

ఇక ఈరోజు సుధీర్ బాబుతో ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాతో వస్తుంది. ఏడాది లో ఆరు సినిమాలు చేసిన కృతి శెట్టి 2022 లో నాలుగు సినిమాలు చేసి షాక్ ఇచ్చింది. మిగతా హీరోయిన్స్ అంతా షాక్ అయ్యేలా ఆమె వరుస సినిమాలతో దూసుకెళ్తుంది. ఓ విధంగా చెప్పాలంటే కృతి శెట్టి (Krithi Shetty)కి ఇది గోల్డెన్ పిరియడ్ అని చెప్పొచ్చు.

ప్రస్తుతం యువ హీరోలతో చేస్తున్న ఆమె స్టార్ సినిమాల కోసం వెయిట్ చేస్తుంది. తన కెరియర్ లో డిఫరెంట్ రోల్స్ చేస్తున్న అమ్మడు. తనకు వచ్చిన ఇమేజ్ ని కాపాడుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ప్రస్తుతం నాగ చైతన్య వెంకట్ ప్రభు కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో ఆమె నటిస్తుంది. ఈ సినిమాలో చంద్రముఖి టైప్ లో కృతి శెట్టి పాత్ర ఉంటుందని టాక్.

Tags: Bebamma, Krithi Shetty, Krithi Shetty 4 Movies, Tollywood, Uppena