సమంత దెయ్యమా లేక యువరాణా… ఆ అప్‌కమింగ్ సినిమాపై ఇంట్రెస్టింగ్ న్యూస్!

టాలీవుడ్ అగ్రతార సమంత ఒక దెయ్యమా లేక యువరాణిలా? అని ఇప్పుడు ఆమె అభిమానులు అందరూ జుట్టు పీక్కుంటున్నారు. ఇది నిజ జీవితంలో కాదండోయ్. సమంత ఇప్పుడు చేస్తున్న రోల్స్ అందర్నీ ఆకర్షిస్తున్నాయి. ఈ ముద్దుగుమ్మ డిఫరెంట్ రోల్స్ చేయడానికి సిద్ధమై అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. గత కొద్ది రోజులుగా ఈ ‘జాను’ సైలెంట్ మోడ్‌లోకి వెళ్ళింది. ఇప్పుడు మళ్లీ వార్తల్లో హల్చల్ చేస్తోంది. సమంత నాగ చైతన్య నుంచి విడిపోయాక ఎవరూ ఊహించని రీతిలో క్రేజీ పాత్రలు చేస్తోంది.

ఈ కుందనపు బొమ్మ ప్రస్తుతం ఒక వెబ్ సిరీస్ చేస్తోంది. దాని కోసం ఆమె మార్షల్ ఆర్ట్స్‌లో ట్రైనింగ్ తీసుకుంటోంది. ఈ సిరీస్‌ను హాలీవుడ్ వెబ్ సిరీస్ సిటాడెల్ ఆధారంగా తీస్తున్నారు. ఇందులో ఈ తార బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్‌తో రొమాన్స్ చేయనుందని టాక్. అంతే కాకుండా హాలీవుడ్ ప్రాజెక్ట్ అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్‌లో కూడా యాక్ట్ చేస్తోంది. అయితే వీటన్నింటికంటే ఆమె బాలీవుడ్ ప్రాజెక్ట్‌లపై అందరి కన్నుంది. బాలీవుడ్‌లో ఈ అమ్మడు ఏ ఏ సినిమాల్లో నటిస్తుందా తెలుసుకోడానికే ఫ్యాన్స్ ఆసక్తి చూపుతున్నారు.

ఈ క్రమంలోనే ఒక ఆసక్తికర న్యూస్ బయటకు వచ్చింది. అదేంటంటే సమంత అమర్ కౌశిక్ దర్శకత్వంలో ఒక హారర్ సినిమాల్లో నటిస్తోంది. అమర్ కౌశిక్ గతంలో ‘స్త్రీ’ అనే హారర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అప్‌కమింగ్ హారర్ ఫిల్మ్ మాత్రం రాజస్థాన్ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందని సమాచారం. ఈ హారర్ కథా చిత్రంలో సమంత డ్యూయల్ రోల్స్‌లో అలరించనుందట. ఒక పాత్రలో అందమైన యువరాణిగా అందరినీ మెప్పించి, మరో పాత్రలో దెయ్యంగా అందరినీ భయపెడుతుందట. అలానే ఆమె యువరాణిగా ఆయుష్మాన్ ఖురానాతో రొమాన్స్ చేయనుందని సినీ సర్కిల్‌లో వినిపిస్తున్న మాట.

Tags: Ayushmann Khurrana, Bollywood movie, ghost role, horror film, princess, Samantha Akkineni