BiggBoss : బిగ్ బాస్ 6 : ఆరంభం అదిరింది..!

మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 6 స్టార్ట్ అయ్యింది. ఆదివారం సాయంత్రం 6 గంటలకు బిగ్ బాస్ (BiggBoss) షో మొదలు పెట్టారు. హోస్ట్ గా నాగార్జున ఎంట్రీ అదిరింది. ఇక హౌజ్ మొత్తం ఓ పాట ద్వారా చూపించి ఒక్కొక్క హౌజ్ మెట్ ని పిలిచి వారి వివరాలని కనుక్కుని హౌజ్ లోకి పంపించేశారు. టోటల్ గా 21 మంది కంటెస్టంట్స్ హౌజ్ లోకి వెళ్లారు. వారిలో సగం మంది ఆడియెన్స్ కి తెలిసిన వారు కాగా మరికొంతమంది మాత్రం కొత్త వాళ్లని చెప్పొచ్చు.

బిగ్ బాస్ రివ్యూస్ చెబుతూ సోషల్ మీడియాలో ఫాలోయింగ్ తెచ్చుకున్న ఆది రెడ్డి కూడా ఈ సీజన్ లో బిగ్ బాస్ ఛాన్స్ అందుకున్నాడు. అంతేకాదు జబర్దస్త్ నుంచి కూడా చలాకి చంటి, ఫైమా బిగ్ బాస్ (BiggBoss) ఛాన్సులు అందుకున్నారు. గీతు కూడా జబర్దస్త్ లో కొన్ని ఎపిసోడ్స్ చేసింది ఆమె కూడా బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

106 రోజుల పాటు జరిగే ఈ బిగ్ బాస్ సీజన్ 6 తో ఆడియెన్స్ కి ఫుల్ ఎంటర్టైన్ మెంట్ ఉంటుందని చెప్పొచ్చు. ఎంటర్టైన్ మెంట్ కి అడ్డా ఫిక్స్ చేసిన నాగార్జున ఇక మీ ఇంటితో పాటు మా బిగ్ బాస్ ఇంటి మీద కూడా ఓ కన్నేసి ఉంచమని చెప్పాడు. మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 6 అనుకున్న విధంగానే గ్రాండ్ గా మొదలైంది.

Tags: Adi Reddy, BiggBoss, BiggBoss 6, BiggBoss Nagarjuna, BiggBoss Telugu, Host Nagarjuna, nagarjuna, Star Maa, Tollywood