రవితేజపై అటాక్ చేయబోతున్న ఆ గ్యాంగ్.. పారిపోతాడా లేక ఎదుర్కొంటాడా?

జులై 29న రిలీజ్ అయిన రవితేజ సినిమా ‘రామారావు ఆన్ డ్యూటీ’ బాక్సాఫీస్ వద్ద దారుణంగా ఫెయిలైన విషయం తెలిసిందే. ఈ సినిమా ఏమాత్రం ఆసక్తికరంగా లేకపోవడంతో దీనిని కొనుగోలు చేసిన బయ్యర్లు నష్టాల్లో నిండా మునిగి పోయారు. ఇప్పుడు నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ రవితేజను కలిసేందుకు సిద్ధమవుతున్నారు. వీరందరూ కలిసి ఒక గ్యాంగ్‌లా ఏర్పడి నష్టపరిహారం చెల్లించాలంటూ రవితేజపై ఒకేసారి అటాక్ చేయబోతున్నారని సినీ సర్కిల్‌లో టాక్‌ కూడా నడుస్తోంది.

నిర్మాత సుధాకర్ చెరుకూరి బయ్యర్లకు తన వంతు సాయం అందజేశాడు. కానీ అవేమీ వారికి ఒక మూలకు కూడా సరిపోలేదు. ఇంకా నష్టాల్లో ఉన్న బయ్యర్లు అందరూ ఉన్నారు. వారందరూ సోమ, మంగళవారాల్లో రవితేజను కలవనున్నారు. రవితేజ తన బ్యానర్ రవితేజ టీమ్ వర్క్స్‌పై ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా, ఈ మూవీ కోసం 18 కోట్లు రెమ్యునరేషన్‌గా మాస్ మహారాజా తీసుకున్నట్లు మరో వార్త ఉంది. అందరు నష్టపోతే కోటి తీసుకొని సైలెంట్ గా ఉండటం ఏమాత్రం సరికాదని సీడెడ్, ఆంధ్రా బయ్యర్లు అసహనం వ్యక్తం చేస్తున్నట్లు టాక్. అలాగే తమ భారీ నష్టాలను భర్తీ చేయాలనే డిమాండ్‌తో రవితేజను కలవడానికి సిద్ధమవుతున్నారు.

డిస్ట్రిబ్యూటర్లు లేదా బయ్యర్లు ఇక్కడ గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే.. రవితేజ టీమ్ వర్క్స్‌ కేవలం ప్రజెంటర్‌గా మాత్రమే ఉంది. సినిమాని ప్రజెంట్ చేసే ప్రతి సంస్థ ఆ మూవీ వ్యాపార భాగస్వాములు కాదు. అప్పుడు వారు నష్టాలు, లాభాలను తీసుకోవడానికి వీలు ఉండదు. అలాంటిది రవితేజ కంపెనీ ఎలా నష్టాలను భరిస్తుంది? అనేది ప్రశ్నార్థకంగా మారింది. నిజానికి ఓ సినిమా ఫెయిలయితే రజనీకాంత్ బయ్యర్లను ఆదుకోవడం తన సొంత డబ్బులు ఇచ్చారు. ఇంకా ఇతర హీరోలు కూడా బయ్యర్లను నష్టాల నుంచి బయటకు తెచ్చేందుకు తమ పారితోషికాన్ని వదులుకున్నారు. మరి రవితేజ ఏం చేస్తాడో చూడాలి.

Tags: cinema buyers, cinema losses, mass maharaja, producer, Rama Rao on duty, Ravi Teja