డిఫరెంట్ పాత్రల్లో నటిస్తున్న సమంత, కీర్తి సురేష్.. ప్రేక్షకులకు షాక్ అవ్వాల్సిందే

అందంలోనూ, నటనలోనూ సమంత, కీర్తి సురేష్ ఇద్దరూ ఇద్దరే. కెరీర్‌లో తమదైన పాత్రలో ఎందరో ప్రేక్షకులను ఈ ఇద్దరు తారలు సంపాదించుకున్నారు. ఇక ఇటీవల కాలంలో ఈ ఇద్దరూ ప్రేక్షకులు షాకింగ్‌కు గురయ్యే పాత్రలు చేస్తున్నారు. ముఖ్యంగా కీర్తి విషయానికి వస్తే మహానటి సినిమాతో ఆమె పేరు జాతీయ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఉత్తమ జాతీయ నటి అవార్డు కూడా దక్కించుకుంది. ఆ తర్వాత ఆమె నటించిన ఏ సినిమాలు సరిగ్గా ఆడలేదనే చెప్పాలి. ముఖ్యంగా మహేష్ బాబుతో సర్కారు వారి పాట సినిమాలో కీర్తి జోడీ కట్టింది. అది కూడా ఆశించిన ఫలితం రాలేదు. ఇక చిన్ని అనే సినిమా అమెజాన్ ఓటీటీలో విడుదలైనా, అది కూడా కీర్తికి ఏమంత కలిసి రాలేదు. ప్రస్తుతం ఆమె నేచురల్ స్టార్ నానికి జోడీగా ‘దసరా’ సినిమాలో నటిస్తోంది. అది కాకుండా ప్రస్తుతం చిరంజీవికి చెల్లిగా ‘భోళాశంకర్’లో నటిస్తోంది. ఈ రెండు సినిమాలో ఆమె చేతిలో ఉన్నాయి. ఇవి తప్పా ఇంకేమీ ఆమె చేతిలో లేవు.

కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన విక్రమ్ సినిమా బాగా హిట్ అయింది. దీని దర్శకుడు లోకేష్ కనకరాజన్ ప్రస్తుతం హీరో విజయ్‌తో హ్యాట్రిక్ సినిమా చేయనున్నారు. ఇందులో హీరోయిన్‌గా సమంత పేరు వినబడుతోంది. అయితే ఆమె పాత్ర డిఫరెంట్‌గా ఉండనున్నట్లు తెలుస్తోంది. అందులో నెగటివ్ పాత్రలో సమంత నటించనున్నట్లు ప్రచారం సాగుతోంది.

గతంలో ఫ్యామిలీమ్యాన్-2 వెబ్‌సిరీస్‌లో ఆమె నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించింది. అదే తరహాలో సమంత పాత్ర డిజైన్ చేసినట్లు సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇక సమంత, కీర్తి సురేష్ కలిసి సీమరాజా, మహానటి సినిమాలలో నటించారు. ఆ రెండు చిత్రాలు మంచి విజయాన్ని దక్కించుకున్నాయి. ఇక రానున్న ఈ సినిమాలో ఈ ఇద్దరూ కలిసి నటిస్తే ప్రేక్షకులకు కనువిందు అవుతుంది.

Tags: actress, Keerthi, key roles, Samantha, suresh, Tollywood