ఓ సినిమా లాస్ హీరోకి ఎంత తలనొప్పిగా మారుతుంది అన్నది ఈమధ్య చాలా సినిమాల నుంచి మనం చూస్తూనే ఉన్నాం. సినిమా తీసేప్పుడు బజ్ చూసి భారీ బడ్జెట్, భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసినా తీరా రిజల్ట్ తేడా కొడితే వచ్చే సంస్యలకు రెడీ అయ్యి ఉండాలి. ఈ క్రమంలో బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చడ్డా భారీ లాసులు తెచ్చింది. 180 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాలీవుడ్ లో చేతులెత్తేసింది.
సినిమాకు దాదాపు 100 కోట్ల పైగా నష్టాలు వచ్చినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో ఆమీర్ ఖాన్ (Aamir Khan) ఈ సినిమా నష్టాలని భరిస్తూ తన రెమ్యునరేషన్ తిరిగి ఇచ్చేసినట్టు తెలుస్తుంది. ఆమీర్ ఖాన్ తన మాజీ భార్య కిరణ్ రావు కలిసి నిర్మించిన లాల్ సింగ్ చడ్డా సినిమాకు ఆమీర్ ఖాన్ 50 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకున్నారట. అయితే సినిమా భారీ లాసులు వచ్చిన కారణంగా తను తీసుకున్న రెమ్యునరేషన్ కూడా తిరిగి ఇచ్చేశాడట.
28 ఏళ్ల క్రితం వచ్చిన ఫారెస్ట్ గంప్ సినిమా రీమేక్ గా లాల్ సింగ్ చడ్డా వచ్చింది. ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ దాదాపు 13 ఏళ్లుగ జరిపారట ఆమీర్ ఖాన్ (Aamir Khan). బాయ్ కాట్ బాలీవుడ్ హడావిడిలో లాల్ సింగ్ చడ్డా సినిమా కొట్టుకుపోయింది.