జ‌గ‌న్ ప‌ద్మ‌వ్యూహంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు..!

గ్ర‌హ‌చారం గంటా మారేతో కుదాబీ కుచ్ క‌ర్ న‌హి స‌క్తా అని హిందీ సామెత‌. ఇప్ప‌డు అచ్చం అలాగే త‌యారైంది. ఏపీ విప‌క్ష నేత‌, మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడి ప‌రిస్థితి. అధికారం పోవ‌డమేమో కానీ ఒక్కొక్క‌ స‌మ‌స్య ఆయ‌న‌ను చుట్టు ముడుతున్న‌ది. గ‌తంలో తొక్కిపెట్టిన కేసుల‌న్నీమ‌ర్రిచెట్టుపై బేతాళ శ‌వంలా లేచి వ‌స్తున్నాయి. తిరిగి విచార‌ణ‌కు వ‌స్తుండ‌డంతో దిక్కుతోచ‌ని ప‌రిస్థితిలో ప‌డిపోతున్నాడు. అధికారంలో ఉన్న స‌మ‌యంలో స్టేలు తెచ్చుకుని కాలం వెల్ల‌దీసిన బాబుకు ఇప్ప‌డు అంత‌టా చుక్కెదుర‌వుతున్న‌ది. ఇప్ప‌టికే చంద్ర‌బాబు అక్ర‌మాస్తులపై విచార‌ణ జ‌ర‌పాల‌ని ఏసీబీకోర్టులో కేసు ఎన్టీఆర్ స‌తీమ‌ణి ల‌క్ష్మీపార్వ‌తి వేసిన విచార‌ణ ప్రారంభమైంది. మ‌రోవైపు బాబు గారికి అత్యంత స‌న్నిహితంగా వ్య‌వ‌హ‌రించిన వారిపై వ‌రుస‌గా ఐటీ, ఏసీబీ అధికారులు దాడుల‌ను నిర్వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే. అదీగాక ఏపీ స‌ర్కారు తీసుకున్న నిర్ణ‌యంతో త‌న‌యుడి ఉన్న ఎమ్మెల్సీ ప‌ద‌వి పోయే ప్ర‌మాదం ఏర్ప‌డింది. ఇలా ఇంటా బ‌య‌టా స‌వాల‌క్ష స‌మ‌స్య‌లు చుట్టుముడుతున్నాయి.

మ‌రోవైపు అధికార వైసీపీ నేత జ‌గ‌న్ కూడా అంతే స్థాయిలో బాబు అక్ర‌మాల‌పై దృష్టిసారించారు. అధికారంలో ఉన్న‌వేళ త‌న‌ను ప‌దేప‌దే అవినీతి ప‌రుడు అని నిందించిన టీడీపీ అధినేత‌ను సైతం అదే బోనులో నిల‌బెట్టేందుకు శ‌త‌విధాల ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు తెలుస్తున్న‌ది. ఇప్ప‌టికే గ‌త ప్ర‌భుత్వం హ‌యాంలో జ‌రిగిన ప‌లు అక్ర‌మాల‌ను వెలికితీసే ప‌నిలో నిమ‌గ్న‌మ‌య్యారు. జ‌ధాని ప్రాంతంలో భూముల కొనుగోళ్ల‌లో ఇన్‌సైడ‌ర్ ట్రేడింగ్ జ‌రిగింద‌ని విప‌క్షంలో ఉన్న‌ప‌టి నుంచే ఆరోపిస్తున్నారు. ప్ర‌స్తుతం అధికారంలోకి రాగానే దానినిపై ఏకంగా సీఐడీ విచార‌ణ జ‌రిపిస్తున్నారు. ఇప్ప‌టికే అధికారులు ఆ కేసుకు సంబంధించి గ‌త టీడీపీ స‌ర్కార్ కెబినెట్‌లోని ఇద్దరు మంత్రులు ప‌త్తిపాటి పుల్లారావు, నారాయ‌ణ‌పై కేసుల‌ను న‌మోదు చేసింది. మొత్తంగా 750 మంది తెల్ల‌రేష‌న్ కార్డుదారుల పేరిట ప‌లువురు కోట్ల విలువైన భూముల‌ను కొనుగోలు చేసిన‌ట్లు గుర్తించింది. దానినిపై విచార‌ణను ముమ్మ‌రం చేసింది. ఇటీవ‌లే ఆ జాబితాలో మ‌రో ఏడుగురి పేర్ల‌ను చేర్చింది.

ఇదిలా ఉండ‌గా ఆ కేసుకు సంబంధించి 2018 నుంచి 2019 వ‌ర‌కు కొనుగోలు చేసిన భూములపై పూర్తిస్థాయి విచార‌ణ జ‌ర‌పాల‌ని కోరుతూ ఏపీ సీఐడీ అడిష‌న‌ల్ డైరెక్ట‌ర్ సునిల్‌కుమార్ ఐటీ చీఫ్ క‌మిష‌న‌ర్‌కు లేఖ రాయ‌డం సంచ‌ల‌నంగా మారింది. మొత్తంగా 106 మంది జాబితాను ఆయ‌న స‌మ‌ర్పించడం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అదీగాక వారు కొనుగోలు చేసిన భూముల స‌ర్వే నంబ‌ర్ల‌ను , నిర్వ‌హించిన లావాదేవీలు త‌దిత‌ర పూర్తి వివ‌రాల‌ను స‌మ‌ర్పించారు. దీంతో ఆయా నేత‌లు గుబులు మొద‌లైంది. క్ర‌మంలో తెర‌మీద‌కు చంద్ర‌బాబు పేరు వ‌చ్చే అవ‌కాశాలున్నాయ‌ని తెలుస్తున్న‌ది. ఆయ‌న పేరును సైతం ఆ జాబితాలో చేరే అవ‌కాశాలున్న‌ట్లు రాజ‌కీయ‌వ‌ర్గాలు అభిప్రాయ‌ప‌డుతున్నాయి. ఇదీగాక పోల‌వ‌రం టెండ‌ర్ల‌లో, నిర్మాణ ప‌నుల్లో జ‌రిగిన అవినీతిపై విచార‌ణ కొన‌సాగించేందుకు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌ర‌మ‌య్యాయి. మొత్తంగా చంద్ర‌బాబును జైలుకు పంప‌డ‌మే ల‌క్ష్యంగా వైసీపీ స‌ర్కారు ప‌ద్మ‌వ్యూహాన్ని ప‌న్నుతున్న‌ది. మ‌రి దీని నుంచి బాబుగారు భ‌య‌ట‌ప‌డ‌తారో? క‌ట‌క‌ట‌కాల పాల‌వుతారో? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.వైసీపీ తీసుకుంటున్న చ‌ర్య‌ల‌తో తెలుగు త‌మ్ముళ్ల‌లో మాత్రం గుబులు రేగుతున్న‌ది.

Tags: acb court, chandrababu naidu, cid, cm jaganmohanreddy, insider trading