Sai Pallavi : ఆ సాంగ్స్ అన్ని పీరియడ్స్ టైం లో చేసిందట.. సాయి పల్లవి డెడికేషన్ కి హ్యాట్సాఫ్..!

Sai Pallavi

సౌత్ స్టార్ హీరోయిన్స్ లో ప్రేక్షకాదరణ పొందిన హీరోయిన్ గా సాయి పల్లవి (Sai Pallavi) సూపర్ క్రేజ్ ఏర్పరచుకుంది. ఆమె చేస్తున్న సినిమాలు చాలా ప్రత్యేకంగా ఉంటున్నాయి. లేడీ పవర్ స్టార్ గా సాయి పల్లవి తన సత్తా చాటుతుంది. సాయి పల్లవి సినిమాలో ఉంటే ఆ సినిమాలో సాంగ్స్ సూపర్ హిట్ అయినట్టే. ఆమె చేసే డ్యాన్స్ కి ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఉన్నారు. అయితే తన కెరియర్ లో చేసిన సూపర్ హిట్ సాంగ్స్ అన్ని కూడా తన పీరియడ్స్ టైం లో చేశానని చెప్పి షాక్ ఇచ్చింది సాయి పల్లవి.

మాములుగా అయితే పీరియడ్స్ టైం లో ఆడవాళ్లకి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ టైం లో రెస్ట్ తీసుకోవాలని కోరుతారు. కానీ సాయి పల్లవి (Sai Pallavi) ఆ టైం లో కూడా షూటింగ్స్ చేసిందట. అంతేకాదు పీరియడ్స్ టైం లోనే తన డ్యాన్స్ ఎపిసోడ్స్ చేసిందట. శ్యాం సింగ రాయ్ సినిమా టైం లో కూడా అలానే జరిగిందని చెప్పింది సాయి పల్లవి.

ఇప్పటికే సాయి పల్లవి అంటే ఆడియెన్స్ లో విపరీతమైన క్రేజ్ ఉండగా ఇప్పుడు ఆమె పీరియడ్స్ టైం లో కూడా డ్యాన్స్ చేశానని చెప్పడంతో సాయి పల్లవి మీద మరింత రెస్పెక్ట్ పెరిగింది. ఈ విషయం తెలిసి సాయి పల్లవికి హ్యాట్సాఫ్ చెబుతున్నారు ఆమె ఫ్యాన్స్.

Tags: Lady Powerstar, Lovestory, Sai Pallavi, Sai Pallavi News, Sai Pallavi Updates, Shyam Singha Roy