మెగాస్టార్ చిరంజీవికి ఎన్నో ఆస్తులున్నాయి. టాలీవుడ్ టాప్ స్టార్‌గా తన సుదీర్ఘ ప్రయాణంలో వివిధ ప్రాంతాల్లో చాలా భూములు కొన్నాడు.
అటువంటి ఆస్తి ఒకటి ఫిల్మ్ నగర్ ప్రధాన రహదారిపై 3000 చదరపు గజాల స్థలం ఉంది. 1990ల ప్రారంభంలో చిరు దీన్ని రూ. 30 లక్షలకు కొనుగోలు చేసినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.ఇప్పుడు చిరు ఈ ప్రధాన భూమిని విక్రయించాడని అంతర్గత వర్గాలు చెబుతున్నాయి. నిజానికి చిరు ఉన్న హోదా చుస్తే ఈ ఆస్తిని విక్రయించడానికి చిరుకి ఎటువంటి కారణం లేదు.
ఒక వార్తా దినపత్రిక యజమాని చాలా కాలంగా ఈ భూమిపై ఆసక్తి చూపుతున్నాడు అని టాక్ దానితో ఇప్పుడు అతను ఆ స్థలాన్ని కొన్నాడంట.
దాదాపు రూ.70 కోట్లకు డీల్ జరిగినట్లు టాక్ . ఇప్పటికే ఈ ప్రాంతంలో చదరపు గజం రూ.2 లక్షల ధర నడుస్తోంది. కానీ డిమాండ్‌ను పరిగణనలోకితీసుకుని అది చదరపు గజం రూ. 2.35 లక్షలకు అమ్మినట్టు తెలుస్తుంది.ఈ విషయం పై చిరంజీవి పీఆర్ టీమ్‌ని సంప్రదించగా వారు కనుక్కుని చెప్పుతానని అన్నారు . కానీ ఇప్పటి వరకు దానిపై ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు.