ఏపీలో అధికార వైసీపీపై రోజు రోజుకు ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందన్నది నిజం. సంక్షేమం అన్నది పక్కన పెడితే అసలు రాష్ట్రంలో ఎక్కడ చూసినా అభివృద్ధి అన్న మాటే వినపడడం లేదు. రహదారులు ఎంత అధ్వానంగా ఉన్నాయో, పోలవరం అయోమయం.. రాజధాని అసలు ఎక్కడ ఉందో ఎవ్వరికి తెలియకపోవడం ఇలా చాలా వరకు పాలన మంచి కామెడీగా ఉంది.
మరోవైపు పలు సర్వేలు జగన్ గ్రాఫ్ రోజు రోజుకు మరింత డౌన్ అవుతోన్న పరిస్థితి స్పష్టంగా ఉంది. ఇలాంటి టైంలో టౌమ్స్ నౌ సర్వేలో ఏపీలో వైసీపీ ఏకపక్షంగా గెలుస్తుందని ఓ కామెడీ సర్వే ప్రచురిచింది. జూన్ – ఆగస్టు నెలల మధ్యలో చేసిన ఈ సర్వేలో వైసీపీకి ఏకంగా 25కు 24 నుంచి 25 ఎంపీ సీట్లు వస్తాయని చెప్పింది.
అసలు ఈ సర్వే ఎంత కామెడీగా ఉందో కనీస రాజకీయ పరిజ్ఞానం లేని అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు, చిన్న పిల్లాడిని అడిగినా ఈజీగా చెప్పేస్తారు. పోలైన మొత్తం ఓట్లలో వైసీపీకి 2019 కంటే ఎక్కువుగా 51 శాతం ఓట్లు వస్తాయని 25 ఎంపీ సీట్లు వస్తాయని సర్వే చెప్పింది. ఇక అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే తరహా ఫలితాలు వస్తాయని సర్వే చెపుతోంది.
కోస్తాలో టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తేనే 10 – 12 లోక్‌సభ సీట్లు సునాయాసనంగా గెలుచుకుంటుందన్న అంచనాల నేపథ్యంలో టౌమ్స్ నౌ చేసిన కామెడీ సర్వే చూసి ఏపీ జనాలు నవ్వుకుంటున్నారు. గతంలో కూడా టౌమ్స్ నౌ వైసీపీకి ఏకంగా 24 – 25 ఎంపీ సీట్లు వస్తాయని చెప్పిన సంగతి తెలిసిందే.