” అల్లం బెల్లం అనసూయ నా పెళ్ళాం “.. ట్రోల్స్ మామూలుగా లేవుగా…!

జబర్దస్త్ షో తో బుల్లితెరకు పరిచయమైంది అనసూయ. యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనసూయ బుల్లితెరపై తనదైన స్టైల్ లో దూసుకుపోతుంది. తర్వాత సినిమాల్లో అవకాశాలు రావడంతో బుల్లితెరకు సెలవిచ్చి వెండితెరపై క్యారెక్ట‌ర్‌ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చింది. రంగస్థలం సినిమాతో మొదట ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అనసూయ తర్వాత వరుస అవకాశాలను అందుకుంది. దీంతో ప్రస్తుతం ప‌లు సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతుంది అనసూయ.

వెండితెర‌పై కూడా రంగ‌స్థ‌లం సినిమాలో రంగ‌మ్మ‌త్త లాంటి మంచి పాత్ర‌లు ద‌క్క‌డంతో ఆమె రేంజ్ మారింది. అయితే ఎప్పటికప్పుడు కాంట్రవర్షియ‌ల్ కామెంట్స్ చేస్తూ వివాదాల్లో చిక్కుకుంటూ ట్రోల్స్‌కి గురవుతూ ఉంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ హాట్ ఫోటోషూట్స్ తో కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తుంది.

ఎప్పుడు సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండే అనసూయ తన పర్సనల్ లైఫ్ అప్డేట్స్‌ కూడా అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. తాజాగా విదేశాల్లో వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది. ఇటీవ‌ల‌ వాషింగ్టన్ సిటీలో తాను దిగిన ఫొటోల‌ను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది.

ఈ ఫొటోల‌లో ఫుల్ డ్రెస్ తో సాంప్రదాయంగానే ఉన్న అనసూయ మీద ట్రోల్స్ మాత్రం ఆగడం లేదు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ” అల్లం బెల్లం అనసూయ నా పెళ్ళాం ” అంటూ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ పెడుతూ భలే ఉన్నావ్ అనసూయ అంటూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు నేటిజన్స్.