‘ హిడింబ ‘ రివ్యూ… వాళ్ల‌కు మాత్రం ప‌ర్‌ఫెక్ట్ వీకెండ్ సినిమా

యాంకర్ ఓంకార్ తమ్ముడు అశ్విన్ బాబు రాజు గారి గది లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత సరైన హిట్ అందుకోలేకపోయాడు. ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టాలని యువ డైరెక్టర్ అనిల్ కన్నిగంటితో కలిసి హిడింబ‌ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నందిత శ్వేత హీరోయిన్గా నటించిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలు అందుకుందా ? అశ్విన్ బాబుకు హిట్ ఇచ్చిందో లేదో చూద్దాం.

హైదరాబాదులో వరుసగా అమ్మాయిలు కిడ్నాప్ అవుతూ ఉంటారు. ఆ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్న అభయ్ ( అశ్విన్ బాబు) పూర్తిస్థాయిలో కేసు తేల్చలేడు. దీంతో కేరళలో ఇలాంటి కేసు చేధించిన ఆద్య ( నందిత శ్వేత) ను నగరానికి తీసుకొస్తారు. వీరిద్దరూ కలిసి మిస్ అవుతున్న అమ్మాయిల వెనుక ఉన్న అసలు సీక్రెట్ చేదించే పనిలో పడతారు. ఈ క్రమంలోనే బోయ అనే వ్యక్తి మీద అనుమానంతో అభయ్ భయంకరమైన బోయ అడ్డాలోకి ఎంటర్ అవుతాడు. అక్కడ ఉన్న అమ్మాయిలను కాపాడుతాడు.

అయితే మిస్ అయిన అమ్మాయిలు వాళ్లు కాకపోవడంతో ఈ కిడ్నాప్ వెనక ఉంది బోయ కాదని తెలుస్తుంది. ఈ కిడ్నాప్ వ్యవహారాన్ని ఇన్వెస్ట్ గెట్ చేస్తున్న తరుణంలో ఒక హత్య వెనక ఊహించని క్లూ దొరుకుతుంది. అక్కడి నుంచి కథ కేరళకు మారుతుంది. కేరళ వెళ్లిన అభయ్, ఆద్య కిడ్నాప్లు ఎవరు ?చేస్తున్నారు అనే విషయం తెలుసుకున్నారా ? అసలు నిజంగా అమ్మాయిలను కిడ్నాప్ చేస్తుంది ఎవరు? కిడ్నాప్ అయిన‌ అమ్మాయిలని అందరిని ఏం చేస్తున్నారు ? ఇంతకీ హిడింబ‌ అంటే ఎవరు ? అన్న ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.

ఎలాంటి కథ అయినా ప్రేక్షకులకు అర్థమయ్యేలా.. వారు ఆ కథలో ప్రయాణించేలా చేస్తేనే ఆ సినిమాను ఆదరిస్తారు. లేదంటే ఎంత గొప్ప కథ అయినా ఎంత క్రియేటివ్ గా చూపించిన వారికి అర్థం కాకపోతే ఆ సినిమా అంతే సంగతి. హిడింబా సినిమాలో అలాంటి పొరపాటు జరిగినట్టు కనిపిస్తుంది. వాస్తవానికి ఈ సినిమా కాన్సెప్ట్ చాలా కొత్తది. తెలుగు తెరపై ఇప్పటివరకు రాని కథతో సినిమా తీసే ప్రయత్నం చేశారు. అయితే దర్శకుడు తప్పిదమో లేదా ఎడిటింగ్ లోప‌మో తెలియదు కానీ ఈ సినిమా ప్రేక్షకులను ఓ గందరగోళానికి గురిచేస్తుంది.

నాన్ లినియర్ స్క్రీన్ ప్లే (అంటే ఒక సీన్ వర్తమానంలో నడుస్తుంటే మరొక సీన్ గతంలో సాగుతూ ఉంటుంది ) తో కాస్త డిఫరెంట్ గా ఈ కథను చెప్పే ప్రయత్నం చేశాడు. ప్రేక్షకులను థ్రిల్ చేసేందుకు దర్శకుడు ఈ ప్రయత్నం ఎంచుకున్నాడేమో అనిపించినా అది తెరమీద సరిగా వర్కౌట్ కాక ప్రేక్షకుడిని గందరగోళానికి గురిచేస్తుంది. నగరంలో వరుసగా కిడ్నాప్లు జరగటం.. ఆ కేసును చేదించేందుకు పోలీసులు రంగంలోకి దిగటం సీన్లతో ఫ‌స్టాప్ సాగుతుంది.

కాలబండలో బోయ ముఠాలో హీరో చేసే ఫైట్ సీన్ ఆకట్టుకుంటుంది. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్ పై ఆసక్తిని పెంచుతుంది. అసలు కథంతా సెకండాఫ్‌లో నడుస్తుంది. హిడింబా తెగకు సంబంధించిన నేపథ్యం ఆసక్తిగా ఉంటుంది. నగరంలో ఒరిస్సా కిడ్నాప్లకు హిడింబా తెగకు సంబంధం ఉండటం చివర్లో వచ్చే ట్రస్టులు, సర్ప్రైజులు ప్రేక్షకులను గురిచేస్తాయి. దర్శకుడు మంచి కథ రాసుకున్న స్క్రీన్ ప్లే మీద మరింత దృష్టి పెట్టి ఉంటే బాగుండేది. స్క్రీన్ ప్లే కనుక రేసీగా ఉండి ఉంటే ఈ సినిమా ఫలితం మరో లెవెల్ లో ఉండేది. సినిమాలో చాలా పాత్రలు ఉన్నా ఎవరిని పూర్తిస్థాయిలో వాడుకోలేదేమో అనిపిస్తుంది.

ఫైన‌ల్ పంచ్‌:
థ్రిల్ల‌ర్ జాన‌ర్ సినిమాలు ఇష్ట‌ప‌డే వారికి ఫ‌ర్‌ఫెక్ట్ వీకెండ్ సినిమా

హిడింబ రేటింగ్‌: 2.25 / 5