రూల‌ర్ రివ్యూ అండ్ రేటింగ్‌..!

న‌టీన‌టులు : బాలకృష్ణ, భూమిక, వేదిక, సోనాల్ చౌహాన్, జ‌య‌సుధ‌
ద‌ర్శ‌క‌త్వం : కె.ఎస్.రవికుమార్
మ్యూజిక్ డైరెక్ట‌ర్ : చిరంతన్ భట్
సినిమాటోగ్ర‌ఫీ : రాంప్రసాద్
నిర్మాత‌ : సి.కళ్యాణ్
బ్యాన‌ర్‌ : సి.కె.ఎంటర్ టైన్మెంట్స్
విడుద‌ల తేది : 20 డిసెంబర్ 2019

నట సింహం నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించి, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు కేఎస్ ర‌వికుమార్ తెర‌కెక్కించిన చిత్రం రూల‌ర్‌. జై సింహా వంటి భారీ హిట్ చిత్రంను రూపొందించిన ర‌వికుమార్ ఇప్పుడు మ‌రోసారి బాల‌య్య‌ను క్లాస్ హీరోగా.. మ‌రోవైపు ఫ‌వ‌ర్ ఫుల్ హీరోగా రెండు వేరియేష‌న్స్‌తో న‌టించిన ఈ చిత్రం ఈ రోజు ప్రేక్ష‌కులు ముందుకు ప్ర‌పంచ వ్యాప్తంగా వచ్చింది. ఈ సినిమాలో బాల‌య్య త‌న విశ్వ‌రూపం ఎలా ప్రద‌ర్శించారో ఓసారి లుక్కేద్దాం.

కథ: బాల‌కృష్ణ అర్జున్ ప్రసాద్ (బాలకృష్ణ) ఒక సాఫ్ట్ వేర్ కంపెనీ సి.ఈ.ఓ. డబ్బు కంటే విలువలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేవాడు అర్జున్ ప్ర‌సాద్‌. బిజినెస్ ఉమెన్ అయిన (జ‌య‌సుధ‌) అర్జున్ ప్ర‌సాద్ ఓ సంద‌ర్భంలో ఆశ్రయమిస్తుంది. జయసుధ ఉత్త‌ర ప్ర‌దేశ్ రాష్ట్రంలోని ఓ ప్రాంతంలో సోలార్ విద్యుత్ ప్రాజెక్ట్‌ను కోసం ప్ర‌య‌త్నం చేస్తుంది. కానీ ఆ ఢీల్ స‌ఫ‌లం కాదు. దీంతో ఈ ప్రాజెక్టును డీల్ చేసేందుకు అక్కడికి వెళ్ళి రంగంలోకి దిగుతాడు అర్జున్ ప్ర‌సాద్‌. డీలో కోసం వెళ్లిన అర్జున్ ప్ర‌సాద్ అంత‌కు ముందే ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఓ ఫ‌వ‌ర్‌ఫుల్ పోలీసాఫీర్ ధ‌ర్మ‌గా ప‌నిచేస్తాడు. అయితే ధ‌ర్మ అర్జున్ ప్ర‌సాద్‌ఘా ఎందుకు మారాడు.. అలా మార‌డానికి గ‌ల కార‌ణాలు ఏమీటి.. సాఫ్ట్‌వేర్ కంపేనీనే ఎందుకు ఏర్పాటు చేయాల్సి వ‌చ్చింది అనేది తెర‌మీద చూస్తేనే బాగుంటుంది.

నటీనటుల పనితీరు: బాల‌కృష్ణ గ‌తంలో అనేక చిత్రాల్లో డ‌బుల్ రోల్ పోషించారు. ఇప్పుడు ఒకే పాత్ర‌తో రెండు విభిన్న‌మైన గెట‌ప్స్‌లో క‌నిపించి ఆక‌ట్టుకున్నాడు. ధర్మగా ఓఫ‌వ‌ర్‌ఫుల్ ఫోలీసాఫీస‌ర్ గా న‌టించిన బాల‌య్య‌.. అర్జున్ ప్రసాద్ గా సాప్ట్‌వేర్ కంప‌నీ సీఈఓగా సాఫ్ట్‌గా మెప్పించారు. బాల‌య్య త‌న పూర్వ వైభవాన్ని అందుకునే విధంగా డైలాగ్‌లతో అద‌ర‌గొట్టాడు. బాల‌య్య డైలాగ్ డెలివ‌రీ జోరు చూస్తే ప్రేక్ష‌కులు, అభిమానులను మిస్మ‌రైజ్ కావ‌డం ఖాయం. బాల‌య్య డైలాగ్ డెలివ‌రి ఏ మాత్రం త‌గ్గ‌లేద‌ని చెప్ప‌వ‌చ్చు. త‌న న‌ట‌న క‌న్నా డైలాగ్‌ల‌తోనే రూల‌ర్ సినిమాకు ఊపు తెచ్చాడు బాల‌య్య‌.ఇలాంటి డైలాగ్‌లు.. పంచ్ డైలాగ్‌లు.. బాల‌య్య‌కే సొంతం అనేలా న‌టించాడు. ఇక బాల‌య్య స‌ర‌స‌న న‌టించిన సోనాల్ చౌహాన్‌, వేధిక‌లు త‌మ రోమాన్స్‌తో ఆక‌ట్టుకున్నారు. ఇక భూమిక ఈ సినిమాలో ముఖ్య భూమికే పోషించింది. జయసుధ, ప్రకాష్ రాజ్, షాయాజీ షిండే లు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతికవర్గం పనితీరు: ఈ చిత్రంలోని పాట‌లు ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునేలా ఉన్నాయి. మ్యూజిక్ డైరెక్ట‌ర్ చిరంతన్ స్వ‌రాలు సినిమాకు హైలెట్ గా నిలుస్తాయి. బాల‌య్య స్టెప్పుల్లో మాత్రం జోష్ త‌గ్గ‌లేదు. కుర్ర‌బామ‌ల‌తో వేసిన డ్యాన్స్‌తో ఆక‌ట్టుకున్నాడు. త‌న‌లో ఏమాత్రం ఛ‌రిష్మా త‌గ్గ‌లేద‌ని నిరూపించాడు బాల‌య్య‌. రాంప్రసాద్ సినిమాటోగ్రఫీ బాలయ్య మాస్ ఇమేజ్ కు తగ్గట్లుగా ఉంది. ద‌ర్శ‌కుడు కె.ఎస్.రవికుమార్ రాసుకున్న 1990ల కాలం నాటి కథ కావ‌డంతో ఈనాటి జ‌నాలు గ‌త చ‌రిత్ర‌ను తెలుసుకునే అవ‌కాశం దొరికింది. మొత్తానికి సినిమా అన్ని రంగాల్లో పూర్తిగా బాల‌కృష్ణ మానియాతో ఊగిపోనున్న‌ది. ఇక ఇత‌ర న‌టీన‌టులను ద‌ర్శ‌కుడు త‌న శ‌క్తి మేర‌కు ఇన్‌వాల్వ్ చేశారు. ఈ సినిమాలో అన్ని విభాగాలు అనుకున్న మేర‌కు స‌క్సెస్ అయ్యాయి అని చెప్ప‌వ‌చ్చు.

విశ్లేషణ: న‌ట‌సింహం బాలయ్య డైలాగ్‌లు.. హీరోయిన్ల రోమాన్స్‌, బాల‌య్య స్టెప్పులు అదుర్స్‌. బాల‌య్య గ‌త చిత్రాల‌కు తీసి పోని విధంగా ఉన్నాయి. ఈ సినిమాతో ఎన్టీఆర్ బ‌యోపిక్ ల డిజాస్ట‌ర్ నుంచి బాల‌య్య త‌ప్పించుకున్న‌ట్లే లెక్క‌. ఈ సినిమా పాజిటివ్ టాక్ తో ముందుకు సాగుతుంద‌ని చెప్ప‌వ‌చ్చు.

రేటింగ్: 3.0/5

Tags: balakrishna, Bhoomika, Review & Rating, Ruler, Sonal Chauhn, Tollywood