నటీనటులు : కార్తీ, జ్యోతిక, నిఖిల విమల్, సత్య రాజ్,సీత, ఇళవరసు తదితరులు.
దర్శకత్వం : జీతూ జోసెఫ్
నిర్మాతలు : రావూరి వి శ్రీనివాస్
సంగీతం : గోవింద వసంత
సినిమాటోగ్రఫర్ : ఆర్ డి రాజశేఖర్
విడుదల తేదీ : డిసెంబర్ 20, 2019
తమిళ హీరో కార్తీ హీరోగా జ్యోతిక, సత్యరాజ్ ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం దొంగ. మెగాస్టార్ చిరంజీవి నటించిన బ్లాక్‌బ్లస్టర్ సినిమా దొంగ చిత్రం పేరుతో కార్తీ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాను దర్శకుడు జీతూ జోసెఫ్ తెరకెక్కించిన సస్పెన్సు అండ్ క్రైమ్ థ్రిల్లర్. తమిళ చిత్రం తంబీ చిత్రానికి తెలుగు అనువాదంగా నేడు ఈ మూవీ విడుదలైనది. కార్తీ గతంలో కూడా మెగాస్టార్ చిరంజీవి నటించిన భారీ హిట్ చిత్రం ఖైదీ. ఈ సినిమా పేరుతో ఇటీవల కార్తీ ప్రేక్షకుల ముందుకు రాగా ప్రేక్షకులు ఈ సినిమాను సూపర్ హిట్ గా నిలివడంతో దొంగ చిత్రంపై అంచనాలు బాగున్నాయి. దొంగ చిత్రం ఎలా ఉందో.. కార్తీ నటనతో ఎలా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించాడో ఓసారి సమీక్షించుకుందాం.
కథ: హీరో కార్తీ (విక్కి) గోవాలో చిన్న చిన్న దొంగతనాలు, చీటింగ్ లు చేస్తూ స్వేచ్చా జీవిగా బతుకుతుంటాడు. 15ఏళ్లుగా తప్పిపోయిన కొడుకు శర్వా కోసం వెతుకుతున్న తండ్రి జ్ఞానమూర్తి(సత్య రాజ్) అక్క పార్వతి(జ్యోతిక). అయితే ఈ విషయం తెలుసుకున్న గోవా పోలీస్ అధికారి జీవానంద్(ఇళవరసు) డబ్బుకోసం విక్కీతో కుమ్మక్కవుతాడు. అయితే విక్కీ శర్వాగా మారి ఆ కోటీశ్వరుల ఇంట్లో కి ప్రవేశిస్తాడు. మరి జ్ఞానమూర్తి కొడుకు శర్వా ఏమయ్యాడు.. విక్కీ ఆ శర్వాగా ఎదుర్కోన్న పరిస్థితులు ఏమిటీ.. పోలీసు అధికారి వేసిన ఎత్తులు ఫలించాయా అనేది తెరపై చూడాల్సిందే.
నటీ నటులు : ఇంతకు ముందే ఖైదీతో వచ్చి మంచి హిట్ సంపాదించిన కార్తీ ఇప్పుడు దొంగ గా వచ్చి ప్రేక్షకులను మెప్పించాడు. కార్తీ ఖైదీ సినిమా జోనర్‌లోనే ఈ సినిమాను ఎంచుకుని విజయవంతం అయ్యాడనే చెప్పవచ్చు. కోటీశ్వరుడైన సత్యరాజ్ తన కొడుకు కోసం పడుతున్న యాతన.. నటించిన తీరు సినిమాకు హైలెట్‌గా నిలిచింది. ఇక జ్యోతిక కూడా తనదైన శైలీలో నటించింది. ఇక సినిమా ఫస్టాఫ్ అంతా నవ్వులే నవ్వులు. ఇక సెకంఢాఫ్ అంతా యాక్షన్‌కు ప్రాధాన్యత ఇచ్చారు. కార్తీకి సరిజోడిగా నిలిచింది నిఖిల విమల్. తన రోమాన్స్‌తో ఆడిపాడింది. సినిమా కామెడీకి కామెడీ.. యాక్షన్‌కు యాక్షన్ సస్సెన్స్‌కు సస్పెన్స్ అన్నింటిని సమ పాళ్ళలో ఉన్నాయి.
సాంకేతిక విభాగం: ఈ సినిమాకు గోవింద వసంత పాటలు ఆకట్టుకున్నప్పటికీ బీజీఎమ్ పర్వాలేదు అన్నట్లుగా ఉంది. ఆర్ డి రాజశేఖర్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. అందమైన హిల్ ఏరియాలో నడిచిన ఈ చిత్ర సన్నివేశాలను ఆయన చక్కగా కెమెరాలో బంధించారు. ఎడిటింగ్ పరవాలేదు. రెన్సిల్డ్ సిల్వా, సమీర్ అరోరా, జీతూ జోసెఫ్ స్క్రీన్ ప్లే మూవీకే ప్రధాన ఆకర్షణ. కథలో పొరలు పొరలుగా వచ్చే ట్విస్ట్స్ ప్రేక్షకుడిని థ్రిల్ చేస్తాయి. దర్శకుడు జీతూ జోసెఫ్ ఒక క్రైమ్ థ్రిల్లర్ ని తెరకెక్కించడంలో చాలా వరకు సక్సెస్ అయ్యారు. ఒక చిన్న పాయింట్ చుట్టూ సస్పెన్సు క్రియేట్ చేసి నడిపిన విధానం బాగుంది. ఆయన చివరి వరకు సినిమాను అలరించే ట్విస్ట్స్ తో నడిపారు. ఐతే జ్యోతిక పాత్రను ఆయన నిర్లక్ష్యం చేశారు. అలాగే సెకండ్ హాఫ్ లో ఆయన కమర్షియల్ అంశాలు విస్మరించారు.
చివరగా : ఖైదీ సినిమాతో మెప్పించిన కార్తీ ఈ సినిమాతోనూ కూడా తెలుగు ప్రేక్షకుల మదిని దోచాడు. తన నటన, కామెడీ, యాక్షన్‌తో మెప్పించాడు. దర్శకుడు కూడా తన శక్తి మేరకు సినిమాను తెరకెక్కించడంలో కృతకృత్యుడు అయ్యాడు. ఇక సినిమా హాస్యంతో కూడిన యాక్షన్ సెంటిమెంట్ సినిమాగా నిలిచిపోతుంది.
రేటింగ్ : 3/5