Pushpa : పుష్ప రాజ్ లేకుండానే పూజ కానిచ్చేశారు..!

సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప (Pushpa) సినిమా సెన్సేషనల్ హిట్ కాగా పుష్ప 2 కోసం ఆడియెన్స్ అంతా ఎక్సయిటింగ్ గా ఎదురుచూస్తున్నారు. పుష్ప 2 అసలైతే ఎప్పుడో మొదలవ్వాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల కుదరలేదు. ఫైనల్ గా ఈరోజు పుష్ప 2 పూజా కార్యక్రమాలు జరుపుకుంది. అయితే హీరో లేకుండానే పూజ కానిచ్చేశారు చిత్రయూనిట్. ప్రస్తుతం అల్లు అర్జున్ న్యూ యార్క్ లో ఉన్నాడు. ఆయన వచ్చేదాకా వెయిట్ చేయకుండానే పుష్ప 2 పూజ చేసుకున్నారు.

పుష్ప 2 (Pushpa) సినిమా మీద బాలీవుడ్ ఆడియెన్స్ కూడా చాలా అంచనాలు పెట్టుకున్నారు. అసలు కథ పార్ట్ 2 లోనే ఉంటుందని సుకుమార్ ఊరిస్తున్నాడు. పుష్ప 2 అంచనాలను అంద్దుకుంటే మాత్రం మరో సంచలనం సృష్టిస్తుందని చెప్పొచ్చు. పుష్ప 2లో అంచనాలకు తగినట్టుగానే భారీ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారట. సెప్టెంబర్ లో సెట్స్ మీదకు వెళ్లనున్న పుష్ప 2 సినిమా 2023 సెకండ్ హాఫ్ లో రిలీజ్ అవుతుందని తెలుస్తుంది. పుష్ప 2 సాంగ్స్ విషయంలో కూడా సుకుమార్ స్పెషల్ కేర్ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది.

 

Tags: allu arjun, Pushpa 2, Pushpa Pooja Event, Pushpa Raj, Rashmika Mandanna, sukumar