గెటప్ శ్రీను కంటే రామ్ ప్రసాద్ పారితోషికం అంత ఎక్కువనా..!

బుల్లితెర పాపులర్ షో ‘జబర్దస్త్ కామెడీ షో’ ద్వారా ఎంతో మంది కమెడియన్లు గుర్తింపు పొందారు. ఎంతో మంది కొత్త ఆర్టిస్ట్ లకు లైఫ్ ఇచ్చింది. సినిమాల్లో అంతగా గుర్తింపు దక్కని కమెడియన్స్ ని జబర్దస్త్ స్టార్స్ ని చేసింది. అంతేకాదు వారు ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేసింది. జబర్దస్త్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న వారిలో సుడిగాలి సుధీర్ టీమ్ కూడా ఒకటి.. అయితే కొన్ని కారణాల వల్ల సుడిగాలి సుధీర్ జబర్దస్త్ షో నుంచి తప్పుకున్నాడు..

రామ్ ప్రసాద్, గెటప్ శ్రీను మాత్రం టీమ్ ని కొనసాగిస్తున్నారు. రామ్ ప్రసాద్ టీమ్ లీడర్ గా కొనసాగుతున్నాడు. జబర్దస్త్ లో వీరిద్దరూ మంచి ఆదాయాన్ని అర్జిస్తున్నారు. అయితే గెటప్ శ్రీను, రామ్ ప్రసాద్ లలో ఎవరి రెమ్యూనరేష్ ఎక్కువ అనే చర్చ ఇప్పుడు జరుగుతోంది.. అయితే అందిన సమాచారం ప్రకారం గెటప్ శ్రీను కంటే రామ్ ప్రసాద్ ఆదాయం ఎక్కువ అని తెలుస్తోంది.. ఎందుకంటే.. రామ్ ప్రసాద్ స్వయంగా స్కిట్ లు రాయడం, ఇతర టీమ్స్ కి కూడా స్క్రిప్ట్ ఇస్తుంటాడు.. అంతేకాదు గంట లేదా రెండు గంటల్లోనే స్క్రీప్ట్ ఇచ్చేస్తాడట.. అందుకే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటాడని వార్తలు వస్తున్నాయి.

ఇక గెటప్ శ్రీను, రామ్ ప్రసాద్ ల పారితోషికం చూసుకుంటే.. గెటప్ శ్రీను ఒక కాల్షీట్ కి రూ.లక్ష తీసుకుంటాడట.. రామ్ ప్రసాద్ స్క్రిప్ట్ మరియు నటనకు గాను ఒక్క కాల్షీట్ కి రూ.1.5 లక్షలు రెమ్యూనరేషన్ అందుకుంటాడు. ప్రస్తుతం జబర్దస్త్ కమెడియన్స్ లో ఆది తర్వాత రామ్ ప్రసాద్ ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట.. అంతేకాదు శ్రీదేవి డ్రామా కంపెనీ షోకు కూడా అత్యధిక రెమ్యూనరేష్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.. ఇక గెటప్ శ్రీను సినిమాల్లో కూడా నటిస్తుంటాడు. దీని ద్వారా గెటప్ శ్రీను భారీ మొత్తంలో సంపాదిస్తున్నట్లు సమాచారం. జబర్దస్త్ లో సీనియర్ కమెడియన్స్ అందరూ సినిమాల కంటే జబర్దస్త్ తోనే ఎక్కువ ఆదాయం పొందుతున్నారట..

Tags: ETV News, Getap Srinu, Jabardasth, movies, ram prasad, Remuneration, show