Ponniyin Selvan : భారీ ధరకు పొన్నియిన్ సెల్వన్ డిజిటల్ రైట్స్..!

మణిరత్నం డ్రీం ప్రాజెక్ట్ పొన్నియిన్ సెల్వన్ సినిమా ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కోలీవుడ్ స్టార్ హీరోలు చియాన్ విక్రం, జయం రవి, కార్తీ కలిసి నటించిన ఈ సినిమా రెండు భాగాలుగా వస్తుంది. (Ponniyin Selvan) పి.ఎస్ 1 సినిమా ట్రైలర్ సినిమాపై ఆసక్తి కలిగించేలా చేసింది. ఇక ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని అమేజాన్ ప్రైం సొంతం చేసుకుందని తెలుస్తుంది. ప్రైం వీడియోలో పి.ఎస్ 1, 2 రెండు భాగాలు రానున్నాయి.

పొన్నియిన్ సెల్వన్ రెండు పార్టులు కలిపి అమేజాం ప్రైం 120 కోట్ల దాకా పెట్టి కొన్నదట. డిజిటల్ రైట్స్ తోనే పొన్నియిన్ సెల్వన్ సినిమా తన సత్తా చాటింది. ఇక మరోపక్క ఈ సినిమా ఆడియో రైట్స్ కూడా 20 కోట్ల దాకా అమ్ముడైనట్టు తెలుస్తుంది. మణిరత్నం ఈ సినిమా తీయాలని దాదాపు దశాబ్ధ కాలంగా ఎదురుచూస్తున్నారు.

అయితే బాహుబలి ఇచ్చిన స్పూర్తితో పొన్నియిన్ సెల్వన్ (Ponniyin Selvan) సినిమాని లార్గ్ స్కేల్ లో తెరకెక్కించారు మణిరత్నం. ఈ సినిమాలో అందాల భామలు ఐశ్వర్య రాయ్, త్రిష కూడా నటించారు. మణిరత్నం ఈ సినిమాని మహేష్, విజయ్ లతో కూడా ప్లాన్ చేశారు. కానీ అది వర్క్ అవుట్ అవలేదు.

Tags: Amazon Prime Video, Jayam Ravi, KARTHI, Maniratnam, PS, vikram