Sreemukhi : బాలీవుడ్ హీరోతో శ్రీముఖి ముద్దులాట..!

బాలీవుడ్ క్రేజీ హీరో రణ్ వీర్ సింగ్ తెలుగు హాట్ యాంకర్ శ్రీముఖి (Sreemukhi)కి ముద్దు పెట్టాడు. ప్రస్తుతం బెంగళూరులో జరుగుతున్న సైమా అవార్డుల వేడుకలో రణ్ వీర్ సింగ్ స్టేజ్ మీదకు రాగా యాంకర్ అనసూయ అమ్మాయిలంతా కుళ్లుకునేలా మీరు నాకొక హగ్ ఇవ్వాలని కోరింది. అయితే శ్రీముఖి కోరిక కాదనలేని రణ్ వీర్ సింగ్ ఆమెకు హగ్ ఇవ్వడమే కాకుండా ఆమె రెండు చేతులని ముద్దాడాడు. సైమా వేడుకల్లో జరిగిన ఈ సంఘటన ప్రేక్షకులను అలరిస్తుంది.

ఇక శ్రీముఖితో పాటు తోటి యాంకర్ గా ఉన్న అలి దీపిక పదుకొనెమ్మా చూస్తున్నావా అంటూ రణ్ వీర్ సింగ్ ని ఆటపట్టించారు. శ్రీముఖి మాత్రం రణ్ వీర్ ముద్దు పెట్టడాన్ని సూపర్ గా ఎంజాయ్ చేసింది. బాలీవుడ్ హీరోలంటే తెలుగు భామలకు అదో రకమైన క్రేజ్. ఇక యాంకర్ శ్రీముఖికి బాలీవుడ్ హీరోలందరు ఇష్టమే అని చెబుతుంది.

బుల్లితెర మీద స్టార్ యాంకర్ గా కొనసాగిస్తున్న శ్రీముఖి (Sreemukhi) వరుస షోలతో తన సత్తా చాటుతుంది. ఛానెల్స్ తో సంబంధం లేకుండా శ్రీముఖి తన యాంకరింగ్ తో అలరిస్తుంది. లేటెస్ట్ గా శ్రీముఖి ఆహా కోసం డ్యాన్స్ ఐకాన్ షోకి మెంటర్ గా కూడా చేస్తుంది.

Tags: Anchor, SIIMA 2022, siima awards, Sreemukhi, Srimukhi, Tollywood