ఎన్టీఆర్ ప్లాప్ హీరోయిన్‌ను గుర్తు ప‌ట్టారా… ఆమె ఏం చేస్తుందంటే…!

మంజరి ఫెడ్నీస్‌ పేరు చెప్పగానే చాలామందికి గుర్తుకు రాదు. కానీ ఎన్టీఆర్ హీరోగా వ‌చ్చిన‌ శక్తి సినిమాలో ఇలియానాతో కలిసి నటించిన మరో హీరోయిన్ అంటే టక్కున గుర్తుకు వస్తుంది. అల్లరి నరేష్ సిద్దు ఫ్రమ్‌ శ్రీకాకుళం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన మంజరి తర్వాత కూడా అల్లరి నరేష్ తోనే శుభప్రదం సినిమాలో హీరోయిన్‌గా నటించింది. కలతపస్‌వి కే.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన సినిమాల్లో ఇదే ఆఖరి సినిమా.

ఇక‌ ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న మంజరి తర్వాత ఎన్టీఆర్‌తో కలిసి శక్తి సినిమాలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఎన్టీఆర్ తండ్రి, కొడుకు పాత్రలో నటించిన ఈ సినిమాలో తండ్రి పాత్ర‌లో ఎన్టీఆర్‌ భార్యగా మంజరి కనిపించింది. ఈ సినిమా ఊహించిన రేంజ్‌లో సక్సెస్ కాకపోవడంతో ఆమెకు అవకాశాలు రాలేదు. దీంతో బాలీవుడ్‌లో పాగావేసింది మంజరి.

అక్కడ వరుస సినిమా అవకాశాలు దక్కించుకుంటూ హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత మరాఠీ, హిందీ సినిమాల్లో కూడా ఈమె నటించింది. హిందీలో సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లో కూడా నటిస్తూ ప్రేక్షకులను అలరించిన ఈమె ప్రస్తుతం గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ప్ర‌స్తుతం మంజ‌రీ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సడన్గా చూస్తే ఆమె మంజరినునా అని ఆశ్చర్యపోయే విధంగా ఆమె లుక్స్ క‌నిపిస్తున్నాయి.