Regina : ప్రేమించి మోసపోయాను.. లవ్ ఫెయిల్యూర్ పై మెగా హీరోయిన్ రెజినా సంచలన కామెంట్స్..!

స్టార్ హీరోయిన్ అవ్వాల్సిన లక్షణాలు అన్ని ఉన్నా సరే కెరియర్ లో వెనకపడ్డ నటి రెజినా కసాండ్ర (Regina). తెలుగులో యువ హీరోల తో కలిసి జోడీ కట్టిన రెజినా ఇప్పుడు వెబ్ సీరీస్ లకే పరిమిత అయ్యింది. ఫీమేల్ సెంట్రిక్ సినిమాలకు ఆమె ప్రాధాన్యత ఇస్తుంది. ప్రస్తుతం శాకిని ఢాకిని సినిమాలో నటించిన రెజినా ఆ సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ లో ఆమె ఒకరిని ప్రేమించి మోసపోయినట్టు వెళ్లడించారు.

తాను ప్రేమలో ఓడిపోయానని.. ఒకరిని ప్రేమించానని కాకపోతే 2020 లో తాను అతనికి దూరమైనట్టు చెప్పుకొచ్చింది Regina. అతని చేతుల్లో మోసపోయానని.. అందుకే కొన్నాళ్లు సినిమాలకు కూడా దూరంగా ఉండాలని అనిపించిందని అన్నది రెజినా. చిన్నప్పటి నుంచి అమ్మ ఒంటరితనం నేర్పించింది. ఇక భవిష్యత్ లో పెళ్లి చేసుకుంటానో లేదో కూడా తెలియదని అంటుంది రెజినా.

రెజినా చెబుతున్న మాటలు చూస్తుంటే లవ్ ఫెయిల్యూర్ వల్ల ఆమె చాలా డిస్ట్రబ్ అయినట్టు అనిపిస్తుంది. ఇంతకె రెజినా ని ప్రేమించి మధ్యలో వదిలేసింది ఎవరు. ఆమెని ఇంతగా బాధపెట్టింది ఎవరని కామెంట్స్ చేస్తున్నారు ఆమె ఫ్యాన్స్.

Tags: Mega Heroine, Regina, Regina Cassandra, Regina Love Story, Shakini Dhakini, Tollywood