సుమంత్ మళ్లీ ఎందుకు పెళ్లి చేసుకోవడం లేదు..కారణం ఏంటంటే?

అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో సుమంత్.. నాగార్జున మేనల్లుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన సుమంత్ స్టార్ హీరోగా రాణించలేకపోయాడు. మంచి కథలను సుమంత్ ఎంచుకోలేకపోయాడు. అందుకే సరైన విజయాలు లేక సుమంత్ కెరీర్ అంత బాగా సాగడం లేదు. అయితే సుమంత్ ని ఇష్టపడేవారు చాలా మంది ఉన్నారు. గతకొంత కాలంగా సుమంత్ కి సరైన హిట్ లేదు. అందుకే సినిమాల్లో కీలక పాత్రల్లో కూడా నటిస్తున్నాడు. రీసెంట్ గా సీతారామం మూవీలో కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. హీరోగా కూడా సినిమాలు చేస్తున్నాడు..

ఇక సుమంత్ వ్యక్తిగత జీవితంలోనూ రాణించలేకపోయారు. పవర్ స్టార్ పవన్ కళ్యాన్ నటించిన తొలిప్రేమ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన నటి కీర్తి రెడ్డి.. మొదటి సినిమాతోనే మంచి పాలోయింగ్ తెచ్చుకుంది. కానీ ఆ తర్వాత ఆమెకు సరైన గుర్తింపు రాలేదు. కీర్తి రెడ్డిని సుమంత్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే వారిద్దరి బంధం ఎక్కువకాలం నిలవలేదు. పెళ్లయిన రెండేళ్లకే విడాకులు తీసుకున్నారు. సుమంత్ ని సినిమాలు వదిలేసి అమెరికాలో వాళ్ల ఫ్యామిలీ బిజినెస్ చూసుకోవాలని కీర్తి రెడ్డి కోరిందట.. అందుకు సుమంత్ ఒప్పుకోలేదు. దీంతో వీరిద్దరి మధ్య గ్యాప్ పెరిగి విడాకులు తీసుకున్నారు..

కీర్తి రెడ్డితో సుమంత్ విడిపోయి చాలా కాలం అయ్యింది.. కానీ సుమంత్ ఇంకా పెళ్లి చేసుకోలేదు. గతంలో ఓ హీరోయిన్ ని సుమంత్ పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ పుకార్లు వచ్చాయి.. అవన్నీ పుకార్లుగానే మిగిలాయి. కాగా తన రెండో పెళ్లి విషయంలో సుమంత్ గతంలోనే క్లారిటీ ఇచ్చాడు. కీర్తిరెడ్డితో విడాకుల తర్వాత తాను చాలా హ్యాపీగా ఉన్నానని అన్నారు. పెళ్లి అవసరం కొందరికి కానీ అందరికీ కాదని, తాను జీవితంలో చాలా సంతోషంగా ఉన్నానని తెలిపారు. మళ్లీ పెళ్లి చేసుకోవాల్సి వచ్చినప్పుడు చేసుకుంటానని సుమంత్ క్లారిటీ ఇచ్చారు.

Tags: latest news, reason, Second Marriage, Sumanth, viral