బాలయ్య సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ అన్ని కోట్లా?

సీనియర్ హీరోలలో బాలకృష్ణ ప్రస్తుతం మంచి ఊపు మంది ఉన్నారు.. గతేడాది అఖండ సినిమాతో భారీ హిట్ అందుకున్న బాలయ్య.. ప్రస్తుతం ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం క్రాక్ సినిమా దర్శకుడు గోపీచంద్ మలినేనితో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అఖండ్ సినిమా సంచలన విజయం సాధించడంలో.. ఆయన నెక్ట్స్ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది..

బాలయ్య నటిస్తున్న NBK107 సినిమాను కొనడానికి డిస్ట్రిబ్యూటర్లు ఎగబడుతున్నారట.. ఈ మూవీ అప్పుడే 130 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమ థియట్రికల్ రైట్స్ 70 కోట్లకు, నాన్ థియట్రికల్ రైట్స్ 60 కోట్లకు అమ్ముడైనట్లు సమాచారం. మరో షాకింగ్ న్యూస్ ఏంటంటే.. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమా కంటే బాలయ్య సినిమాకే ఎక్కువగా డిమాండ్ ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చిరంజీవి లేటెస్ట్ సినిమా ఆచార్య అట్టర్ ఫ్లాప్ కావడం, బాలయ్య నటించిన అఖండ బ్లాక్ బస్టర్ సాధించడమే అందుకు కారణమని తెలుస్తోంది.

బాలయ్యా- మలినేని గోపీచంద్ కాంబోలో రాబోతున్న NBK107 లో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో దునియా విజయ్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య అనిల్ రావపూడితో సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాకు కూడా మార్కెట్ లో ఇప్పటి నుంచే క్రేజీ ఆఫర్లు వస్తున్నట్లు టాక్. ఇక బాలయ్య ఈ మధ్య అన్ స్టాపబుల్ అనే టాక్ షోతో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ టాక్ షో బాలయ్యకు ఎలాంటి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టిందో అందరికీ తెలిసిందే..బాలకృష్ణ ఈ స్థాయిలో మార్పు చెందడానికి ఆయన చిన్న కూతురు తేజస్వి కారణమని ఇండస్ట్రీ వర్గాలు చర్చించుకుంటున్నారు. బాలయ్యకు సంబంధించిన అన్ని కార్యకలాపాలు, కాంబినేషన్ సెట్టింగ్స్ అన్ని కూడా ఆమెనే చూస్తున్నారట..

Tags: Bala krishna, fans, latest news, pre realase, social media