శ్రీవిష్ణు హీరోగా ప్రదీప్ వర్మ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘అల్లూరి’. ఈ చిత్రంలో కయదు లోహర్ హీరోయిన్ గా నటించంది. బెక్కెం వేణుగోపాల్ ఈ సినిమాను నిర్మించారు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం జరగింది. ఈ ఈవెంట్ కి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్పెషల్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ అందరికీ నమస్కారం అంటూ తన స్పీచ్ స్టార్ట్ చేశారు. శ్రీ విష్ణును అభిమానులకు, నా అభిమానులకు థ్యాంక్స్ అన్నారు. అందరికీ అభిమానులు ఉంటారని, కానీ తనకు మాత్రం ఆర్మీ ఉంటుందని తెలిపారు. తనపై అభిమానం కురిపిస్తున్న ప్రతిఒక్కరికీ ధన్యవాదలు చెప్పారు..
హీరోయిన్ కి సారీ చెప్పిన అల్లు అర్జున్:
అల్లూరి సినిమాలో నటించిన హీరోయిన్ పేరు తనకకు అర్థం కాలేదని, ఆమె పేరు పలకడం చాలా కష్టంగా ఉందని అల్లు అర్జున్ అన్నారు. హీరోయిన్ పేరు పలకలేకపోయినందుకు.. ఆమెకు సారీ చెప్పారు. నిర్మాత బెక్కెం వేణుగోపాల్ బన్నీ చెవిలో ఆమె పేరు చెప్పారు. ఆ తర్వాత బన్నీ మాట్లాడుతూ కాయదు లోహర్ కు ఇది తొలి సినిమా అని, వెల్ కమ్ టు టాలీవుడ్ అని ఆమెను ఆహ్వానించారు. నిర్మాణ వేణుగోపాల్ కి అభినందనలు తెలిపారు. దర్శకుడు ప్రదీప్ వర్మకు, మ్యూజిక్ డైరెక్టర్, సినిమాటోగ్రఫర్ కి బెస్ట్ విషెస్ చెప్పారు.
నాకు ఇష్టమైన వ్యక్తి శ్రీవిష్ణు:
‘నాకు ఇష్టమైన వ్యక్తుల్లో శ్రీవిష్ణు ఒకరు. ‘ప్రేమ ఇష్క్ కాదల్’ సినిమాలో ముగ్గురు హీరోల్లో ఒకరిగా శ్రీవిష్ణు టాలీవుడ్ కి పరిచయమయ్యాడు. అందులో బాగా నటించాడు. శ్రీవిష్ణు ప్రతి సినిమాను ఫాలో అవుతాను. శ్రీవిష్ణు ఎంచుకొనే మూవీస్ లో కొత్తదనం ఉంటుంది. హిట్, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా మంచి స్టోరీస్ ఎంచుకుంటాడు. సినిమా కోసం ఎంతో కష్టపడతాడు. శ్రీవిష్ణుకు నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది’ అని అల్లు అర్జున్ తెలిపారు.
‘అల్లూరి సినిమా సెప్టెంబర్ 23న విడుదల కానుంది. సినిమా షూటింగ్ లేనప్పుడు మాత్రం ఈవెంట్స్ కి వస్తుంటా.. బిజీగా ఉంటే మాత్రం ఈవెంట్స్ కి హాజరుకాను.. అయితే శ్రీవిష్ణు నా వద్దకు వచ్చి.. అల్లూరి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రావాలని కోరాడు. శ్రీవిష్ణు నాకు ఎప్పుడు ఏ సహాయం అడగలేదు. అందుకే అడగ్గానే చూద్దామని అన్నాను. కానీ మైండ్ లో మాత్రం తప్పకుండా వెళ్లాలని ఫిక్స్ అయిపోయా. షూటింగ్ ఉన్నా మధ్యలో వెళ్లాలని అనుకున్నాను’ అని బన్నీ తెలిపారు.
ఇక టాలీవుడ్ సినిమాల గురించి ఇండస్ట్రీలో చర్చ జరుగుతుంది. కరోనా తర్వాత వచ్చిన పెద్ద సినిమాల్లో కొన్ని హిట్ అయితే, కొన్ని ఫ్లాప్ అయ్యాయి. చిన్న సినిమాల విషయంలోనూ అదే జరిగింది. అయితే పెద్ద సినిమాలు ఆడతాయి.. చిన్న సినిమాలు ఆడవు అని లేదు. కంటెంట్ బాగుంటే చిన్న, పెద్ద అనే తేడా లేకుండా సినిమాలు ఆడతాయి. సినిమాలను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పారు. అల్లూరి సినిమాలో మంచి కంటెంట్ ఉంది. ఈ సినిమాను కూడా ఆదరించండి’ అంటూ అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు.