RC15 : దిల్ రాజు మీద గుర్రుగా ఉన్న మెగా ఫ్యాన్స్..!

మెగా పవర్ స్టార్ రాం చరణ్ (RC15 ) హీరోగా శంకర్ డైరక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా సెట్స్ మీద ఉంది. ఈ సినిమాని ప్రముఖ నిర్మాత దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చరణ్ సరసన కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఈ సినిమా విషయంలో మెగా ఫ్యాన్స్ అంతా నిర్మాత దిల్ రాజు మీద ఫైర్ అవుతున్నారు.

సినిమా షూటింగ్ టైం లో దిల్ రాజు సరైన జాగ్రత్తలు తీసుకోక పోవడం వల్లే RC15 సినిమా నుంచి లీకులు జరుగుతున్నాయని అంటున్నారు. మొన్నామధ్య చరణ్ ఫోటో ఒకటి లీక్ అవగా చరణ్, కియరా కాలేజ్ కి వెళ్లే సీన్ లోకి పిక్ ఒకటి లీక్ అయ్యింది. ఇప్పుడు ఏకంగా సినిమాలో ఓ చిన్న మ్యూజిక్ బిట్ లీక్ అయ్యింది. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలోని మ్యూజిక్ బిట్ లీక్ అవడం మెగా ఫ్యాన్స్ ని హర్ట్ అయ్యేలా చేస్తుంది.

దిల్ రాజు ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవట్లేదని మెగా ఫ్యాన్స్ అంటున్నారు. పాన్ ఇండియా సినిమా తీయడమంటే అంత సామాన్యమైన విషయం కాదని సినిమా నుంచి ఎలాంటి లీకులు లేకుండా జాగ్రత్త వహించాలని అన్నారు. మెగా ఫ్యాన్స్ అంతా ఈ విషయంలో అప్సెట్ గా ఉన్నారు.

Tags: Dill Raju, Kiara Advani, mega fans, ram charan, Shankar, Tollywood